నష్టపోయాం.. సాయం చేయండి: జగన్

Update: 2019-12-20 06:04 GMT
ఏపీ సీఎం జగన్ తాజాగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ బృందంతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని.. ఉదారంగా సాయం చేయాలంటూ ఆర్థిక సంఘాన్ని కోరారు.

విభజనతో తీవ్రంగా నష్టపోయామని.. ఆ గాయాలు మానడం లేదని.. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన ఏపీకి అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదారంగా సాయం చేయాలని ఆర్థిక సంఘానికి జగన్ విజ్ఞప్తి చేవారు.విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని కోరారు.

రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా సిఫార్సులు చేయాలని 15వ ఆర్థిక సంఘానికి జగన్ విజ్ఞప్తి చేవారు. పెండింగ్ హామీలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు.

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ రంగాలపై సమగ్రమైన నివేదికను ఆర్థిక సంఘానికి జగన్ అందజేశారు. నిధులు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు.
Tags:    

Similar News