చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్న చందంగా టీడీపీ పాలన సాగిందని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఆరోపించారు. అమరావతి నూతన రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కొని వాటి తాత్కాలిక నిర్మాణాలంటూ టీడీపీ ప్రభుత్వం భారీ ఖర్చు చేసిందని.. టీడీపీ నేతల చేతుల్లోని కాంట్రాక్టు సంస్థలకు అధికంగా బిల్లులు చెల్లించి లబ్ధి చేకూర్చినట్టు ఆరోపించిన సంగతి తెలిసిందే.. అందుకే అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులకు సంబంధించిన పనులన్నింటిని ఆపివేయాలని.. సమీక్షించిన తర్వాత కాంట్రాక్టు - ఖర్చు - ఎంత వ్యయం చేశారనే దానిపై సమీక్షించాకే బిల్లులు చెల్లించాలని జగన్ ఆరోపించారు. దీనిపై ఇప్పటికే అధికారులు, టీడీపీ నేతల్లో వణుకు ,టెన్షన్ మొదలైంది..
అమరావతిలో నిర్మాణలు సహా.. రాష్ట్రంలోని పనులన్నింటిని టీడీపీ నేతలే చేపట్టారని సమాచారం. చంద్రబాబు ప్రోద్బలంతో అధికంగా బిల్లులు పొంది కోట్లు కొల్లగొట్టారన్న విమర్శ ఉంది. ముఖ్యంగా అమరావతిలో వెలగపూడిలో సచివాలయం - హైకోర్టు - శాసనసభ - శాసనమండలి పేరిట తాత్కాలిక నిర్మాణాలకు టీడీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ నేతల జేబులు నింపిందన్నది వైసీపీ విమర్శ. అందుకే ఇప్పుడు అమరావతి లెక్కలు తేల్చే పనిలో జగన్ పడ్డారు.
తాజాగా ఒక్కో శాఖపై సమీక్షిస్తూ.. ఈనెల 6న రాజధాని పనుల నిర్మాణం, పనుల పురోగతిపై సమీక్షించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అధికారులకు సమాచారం వెళ్లింది. నిర్మాణ పనులను పొందిన కాంట్రాక్ట్ వివరాలతోపాటు ఏ నిర్మాణానికి ఎంత అంచనా వ్యయాన్ని నిర్ధారించాలనే అంశాలపై జగన్ సమీక్షించనున్నట్టు తెలిసింది. వీటికి చెల్లింపులు, ఎంత ఎంత మొత్తంలో బిల్లులు చెల్లించారనే అంశాలపై జగన్ సమీక్షించనున్నట్టు తెలిసింది.
జగన్ ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు - కాంట్రాక్ట్ పొందిన టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. సీఎంగా జగన్ దూకుడు మీద ఉండడంతో ఇప్పుడు దీనిలోని అవినీతిపై నిగ్గు తేలుస్తాడని అధికారులు కూడా భయపడుతున్నట్టు సమాచారం. ఇక కాంట్రాక్ట్ పనులకు అధికంగా బిల్లులు చెల్లించి ఉంటే వాటిని వెనక్కి తీసుకోవడం కూడా జగన్ చేయడం ఖాయమని వార్తలు వెలువుడుతున్నాయి.ఇక సీఆర్డీఏలో మాజీ ఐఏఎస్ లకు భారీగా గౌరవ వేతనం ఇచ్చి కన్సలెంట్లుగా నియమించుకొని దుబారా చేసిన వైనం కూడా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది వేచిచూడాల్సిందే.