మండలిపై జగన్ వ్యూహం..వైసీపీలోకి 10మంది టీడీపీ ఎమ్మెల్సీలు

Update: 2020-01-20 02:00 GMT
ఏపీకి 3 రాజధానుల బిల్లును సీఎం జగన్ శాసనసభలో ప్రవేశపెట్టించారు. ఆర్థిక మంత్రి బుగ్గన మూడు రాజధానుల బిల్లును పెట్టారు. అయితే శాసనసభలో 151 ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఇక్కడ ఆమోదం పొందడం ఈజీనే..అయితే శాసన మండలిలో బలం లేని వైసీపీ ‘ఈ రాజధాని బిల్లును’ ఎలా ఆమోదింపచేస్తుందనేది ఆసక్తిగా మారింది.

అమరావతి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్న చంద్రబాబు ప్రధానంగా మండలిలో తనకు బలముండడంతో బిల్లును అక్కడే అడ్డుకోవాలని భావిస్తున్నాడు.

అయితే తాజాగా మండలిలో ‘ఏపీకి 3 రాజధానుల’ బిల్లును ఆమోదింప చేసేందుకు జగన్ సర్కారు మాస్టర్ ప్లాన్ వేసింది. తాజాగా మండలి సమావేశాలకు టీడీపీకి చెందిన 10 ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం గమనార్హం. ఇది వైసీపీ స్కెచ్ గానే భావిస్తున్నారు. టీడీపీకి ఈ పరిణామం షాకింగ్ మారింది.

మండలిలో అడ్డుకుంటామని భావించిన చంద్రబాబు - తెలుగుదేశం వాళ్లకు ఏకంగా 10మంది ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం షాకింగ్ లా మారింది. మండలిలో తమకు మెజార్టీ ఉందని.. అడ్డుకుందామని చూసిన చంద్రబాబుకు వైసీపీ స్కెచ్ ముందు తెల్లబోయారు. 10 మంది టీడీపీ ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడంతో చంద్రబాబు తేలిపోయారు. జగన్ సర్కారు ప్లాన్ వర్కవుట్ అయ్యింది. దీంతో మండలిలోనూ ఏపీ రాజధానుల బిల్లు ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News