ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కొత్తింటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న ఈ కొత్తింటి గృహప్రవేశం ఇప్పటికే జరగాల్సి ఉంది. అయితే.. జగన్ సోదరి షర్మిల ఆరోగ్యం సరిగా లేకపోవటంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా గృహప్రవేశ కార్యక్రమానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 27న (బుధవారం) గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే రోజున ఇంటితో పాటు.. పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు.
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు.. పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు.. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు.. పార్లమెంటు.. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు.. ఇతర ముఖ్యనేతల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.