అమరావతిపై జాతీయ మీడియాతో ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Update: 2020-02-11 09:00 GMT
అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని విషయంలో అసంతృప్తితో ఉన్నారు. పేరుకు రాజధాని పక్కన తాడేపల్లిలో జగన్ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అసలు ఉండాలని లేదు. అప్పట్లో రాజకీయాల కోసం రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నిర్మించుకున్నారు. ఆయన పాలన బాధ్యతలు చేపట్టగా అసలు విషయం అవగతమై రాజధాని మార్పుపై సమాలోచనలు చేశారు. అందులో భాగంగానే మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం రాజధానిగా కొనసాగుతున్న అమరావతి ఆయనకు నచ్చలేదు. అందుకే ఆయన ఇంకా అమరావతిని ఓ గ్రామంగా భావిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ మోహన్‌ రెడ్డితో సోమవారం జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ సమయంలో అమరావతి అంశంపై ప్రస్తావన రావడంతో జగన్ స్పందించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఇప్పటికీ గ్రామమేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోని రాజధాని నగరాలకు ధీటుగా నిలవాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని తెలిపారు. హైదరాబాద్ - చెన్నై - బెంగళూరు లాంటి నగరాలకు పోటీగా నిలవాలంటే అమరావతి సరిపోదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్నం అయితేనే రాజధానికి అనువైందని ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధి విషయమై మాట్లాడారు. పదేళ్లలో విశాఖపట్టణాన్ని ఈ మూడు రాజధాని నగరాలకు ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని జగన్ తెలిపారు. అమరావతిని అభివృద్ధి చెందిన రాజధాని నగరంగా రూపుదిద్దుకోవడానికి 50 ఏళ్లకు పైగానే పడుతుందని.. అప్పటివరకూ ఏపీ యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ విధంగా జగన్ జాతీయ మీడియాతో కూడా మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా మాట్లాడారు. రాజధానిగా అమరావతి ఇప్పుడిప్పుడే అభివృద్ధి కాదు.. చాలా సమయం పడుతుందనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన చేసినట్లు వివరించారు.


Tags:    

Similar News