అప్పుడప్పుడు జగన్ ఢిల్లీకి వెళుతుంటారు. వెళ్లిన ప్రతిసారీ దాదాపుగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన కలుస్తుంటారు. మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. పనిలో పనిగా వినతిపత్రం కూడా ఇచ్చి వస్తుంటారు. రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న ప్రణబ్ తో వైఎస్ ఫ్యామిలీకి ఉన్న దగ్గరతనం చాలామందికి తెలిసిందే. ప్రణబ్ దాను విపరీతంగా నమ్మే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఆయన చెప్పినట్లుగా నడుచుకునే వారన్న పేరుంది. చాలా విషయాల్లో తండ్రి వైఎస్ ధోరణికి భిన్నంగా వ్యవహరించే జగన్.. కొన్ని విషయాల్లో మాత్రం తండ్రి మాదిరే నడుచుకుంటారని చెబుతారు. అలాంటి వాటిల్లో ప్రణబ్ దా విషయంలో తన తండ్రి అనుసరించిన విధానాన్నే జగన్ ఫాలో అవుతారన్న మాట ఉంది.
రాష్ట్రపతి అయ్యేవరకూ చురుగ్గా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ప్రణబ్.. సలహాలు.. సూచనలు అత్యంత విలువైనవన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాల పర్యంతం కాంగ్రెస్ అధినాయకులకు సలహాదారుగా వ్యవహరించిన విశేష అనుభవం జగన్ లాంటి నేతకు ఎంతో అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. తన కష్టసుఖాల్ని ప్రణబ్ దాతో జగన్ చెప్పుకుంటారని చెబుతారు. ప్రణబ్ ఇప్పుడైతే రాష్ట్రపతి అయ్యారు కానీ.. చాలాకాలం నుంచి వైఎస్ ఫ్యామిలీకి రాజకీయంగా పెద్దదిక్కుగా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోలేం.
తాజాగా ఢిల్లీకి వెళ్లిన జగన్ ఏం చేశారు? ఎక్కడున్నారు? ఎవరితో భేటీ అయ్యారన్న విషయాలపై దృష్టి పెడితే ఆసక్తికర సమాచారమే లభిస్తుంది. తనకు అత్యంత సన్నిహితుడు.. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లోనే ఎక్కువ సమయం జగన్ గడిపారు. ఈ సమయంలో ఇంట్లో పని మనుషుల్ని కూడా బయటకు పంపేయటం గమనార్హం.
అంతేకాదు.. హోంశాఖకు చెందిన కొందరు అధికారులతో జగన్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మరికొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులతోనూ ఆయన చర్చలు జరిపారని చెబుతున్నారు. ఈడీ నుంచి తాజాగా సమన్లు అందుకున్న నేపథ్యంలో ఢిల్లీలో జగన్ సుదీర్ఘ మంతనాలు జరపటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఈడీ నుంచి తాజాగా ఎదురైన పరిస్థితులకు సొల్యూషన్ కనుగొనే ప్రయత్నంలోనే జగన్ ఢిల్లీ పర్యటన జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవేమీ పైకి కనిపించకుండా.. ఎప్పటిమాదిరే మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జగన్.. రాష్ట్రపతి ప్రణబ్ దాతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. చూసేందుకు రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీకి వచ్చినట్లు కనిపిస్తున్న జగన్.. అంతకు మించి చాలానే పని చేయటం గమనార్హం.