విశాఖే రాజధాని.. జగన్ మరో వరం.?

Update: 2019-12-26 10:54 GMT
ఈనెల 27న జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని.. పరిపాలన రాజధానిగా విశాఖను చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖపట్నంపై వరాలు కురిపించడం ఆ వార్తలకు బలం చేకూరేలా ఉంది.

సీఎం జగన్ ఇప్పటికే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు 27న కేబినెట్ భేటిలో అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖకు జగన్ వరాలు ప్రకటించారు.

విశాఖ అభివృద్ధికి ఏపీ సర్కారు తాజాగా రూ.394.50 కోట్లు విడుదల చేసింది. కాపులప్పాడులో బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ.22.50 కోట్లు - కైలాసగిరి ప్లానిటోరియానికి రూ.37కోట్లు - సిరిపురం జంక్షన్ లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ అండ్ వాణిజ్య సముదాయం కోసం రూ.80కోట్ల నిధులు కేటాయించింది.

రేపు జరిగే కేబినెట్ భేటిలోనే విశాఖను రాజధానిగా చేస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అందుకు అవకాశం కల్పించేలానే ఈ నిధులు విడుదల చేసినట్టు తెలుస్తోంది.
    

Tags:    

Similar News