త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు - రెండేళ్ల తర్వాత రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ క్రమంలో క్రియాశీలంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కీలక సామాజికవర్గమైన కాపులకు చేరువ అయ్యేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తునిలో జరిగిన కాపు గర్జన కాస్త ఉద్రిక్తగా మారడంతో కాపు రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారింది. కాపు రిజర్వేషన్లను బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కాపులు సైతం రాయలసీమ - ఆంధ్రా ప్రాంతంలో బలమైన సామాజిక వర్గంగా ఉండటంతో ఆ వర్గంపై వలవేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నాయి. తక్షణం కాపులకు బీసీ జాబితాలో చేర్చాలంటూ దీక్షకు పూనుకొన్న ముద్రగడ పద్మనాభంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన మీడియా సంస్థ ద్వారా ముద్రగడ్డ పద్మనాభం దీక్షకు - ఉద్యమానికి - ఆయనకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలు - ఆందోళనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో కాపు రిజర్వేషన్లకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలపడమే కాకుండా ఆయన తన పార్టీలోని కాపు సామాజిక వర్గ నేతలను రంగంలోకి దించినట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఇప్పటికే ఆ పార్టీ రంగంలోకి దించింది. మరోవైపు కాపు రిజర్వేషన్లకు మద్దతుగా బొత్స సత్యనారాయణ రోజురోజుకు గళం తీవ్రం చేస్తున్నారు.
అయితే అధికార తెలుగుదేశం పార్టీ - మరో ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం ఇదే వేటలో ఉన్నాయని తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం దాల్చడంతో ఆ సామాజిక వర్గం సానుభూతి కోసం అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు మమ్మురం చేశాయి. కాపు వర్గం వారికి మద్దతుగా తమ పార్టీలలోని అదే సామాజిక వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీసీలతో పాటు కాపు సామాజిక వర్గం మద్దతు పొందిన అధికార టీడీపీ సైతం తనపై ఆ సామాజిక వర్గం పెట్టుకొన్న విశ్వాసాన్ని నిలబెట్టుకొనేందుకు నానా తంటాలు పెడుతోంది. కాపు రిజర్వేషన్ల కోసం మంజునాథ కమిషన్ ను వేసిన అధికార టీడీపీ తన కాపు నేతల చేత కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై విమర్శలను ఎక్కిపెడుతోంది. తనకు పట్టుగొమ్మగా ఉన్న బీసీలు దూరంకాకుండా చూసుకొంటూ కాపులను బుజ్జగించే ప్రయత్నం మొదలెట్టింది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన పేరుతో ఎస్ ఎంఎస్ ల ద్వారా ప్రచారం చేయించిందన్న వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు ఇతర మంత్రుల చేత బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ల ఇస్తామని - ఇచ్చి తీరుతామని ఎస్ ఎంఎస్ లు ఇప్పించిందన్న ప్రచారముంది. కాపుల రిజర్వేషన్ల కోసం కమిషన్ ను నియమించడంతో పాటు ఆ కమిషన్ నివేదికకు పరిమిత సమయం టిడిపి సర్కార్ విధించింది. కమిషన్ ద్వారా రిజర్వేషన్లు ఇస్తేనే రాజ్యాంగ బద్దత ఉంటుందని వాదిస్తున్న టిడిపి సర్కార్ కాపు ఫైనాన్స్ ఫెడరేషన్ కు వచ్చే బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చింది. అయితే కమిషన్ నియామకం అంటే కాలయాపన కోసమేననని వైసీపీ ఇప్పటికే ప్రచారం మొదలేసిన విషయం తెలిసిందే. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని గంపగుత్తగా తనవైపు తిప్పుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది.
మరోవైపు ఇప్పటికే ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ సైతం తాను రాష్ట్రంలో బలపడేందుకు కాపు అస్త్రాన్ని ఆ పార్టీ సైతం ప్రయోగిస్తోంది. బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు ఆ పార్టీ నేతలు దాసరి నారాయణరావు - చిరంజీవి - పళ్లంరాజు తదితరులు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం తన పార్టీలోని కాపు నేతలను రంగంలోకి దించింది. మరో నేత సి.రామచంద్రయ్యకు సైతం రాయలసీమ కాపు నేతల్లో పేరుంది. వీరిని రంగంలోకి దించిన ఏపీ కాంగ్రెస్ పార్టీ వారి చేత కాపు రిజర్వేషన్లకు మద్దతుగా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. తుని ఘటనపై ఏపీ సీఎంకు లేఖ రాసిన చిరంజీవి కాపు రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేసిన విషయం కూడా తెలిసిందే.