మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డిని తలుచుకొని ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ అయ్యారు. ‘నేను లేకుంటే గౌతమ్ రెడ్డి అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడు కాదేమో’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నెల్లూరుకు వెళ్లిన ఆయన దివంగత మంత్రి గౌతం రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం గౌతం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గౌతం రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని జగన్ మాట్లాడారు. గౌతంతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గౌతం మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉందన్నారు. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు మంచి స్నేహితుడు.. ప్రతి అడుగులో నాకు తోడుగా ఉన్నాడన్నారు. గౌతం రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిదని.. రాజకీయాల్లోకి తనను నేను తీసుకువచ్చానని తెలిపారు. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతం వల్లే రాజమోహన్ రెడ్డి మద్దతు లభించిందని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో నన్ను ఎంతో ప్రోత్సహించారన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఆరు శాఖలకు మంత్రిగా పనిచేశారని.. మంచి స్నేహితుడు.. మంచి వ్యక్తిని కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతం కుటుంబానికి పార్టీతోపాటు అంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్.
వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉదయగిరి, బద్వేలు, ఆత్మకూరుకు ఎంతో మేలు జరుగుతుందని.. మే 15లోగా గౌతం జ్ఞాపకార్థం సంగం బ్యారేజ్ ను ప్రారంభిస్తామని వెల్లడించారు.
-సీఎం జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరులో పర్యటిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో బయలు దేరి నెల్లూరు పోలీస్ కవాతు మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కు వచ్చారు. అక్కడ మేకపాటి గౌతం రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు. అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం అయ్యారు.
అయితే సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడింది.మూడంచెల భద్రతా వలయాన్ని ఛేదించుకొని హెలిప్యాడ్ వద్దకు ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి చేరుకున్నారు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్ కెమెరాలో సీఎం జగన్ దృశ్యాలను చిత్రీకరించాడు. చివరి నిమిషంలో ఈ ఘటనను గుర్తించిన పోలీసులు.. విద్యార్థిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. విద్యార్థి అన్నీ దాటుకొని అక్కడికి వచ్చేవరకూ ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ సాగుతోంది. ఆ విద్యార్థి వీడియో తీయడానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.