కేసీఆర్ - జగన్ ఫైట్.. వీళ్లు హ్యాపీ

Update: 2020-02-29 02:30 GMT
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీపోటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాలు విజయవంతం కావడం వల్లే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలకు అందించే ‘ఆసరా’, రైతుల కోసం చేపట్టిన ‘రైతుబంధు పథకం’ ‘రైతు బీమా’ ‘రైతు రుణమాఫీ’ పథకాలు టీఆర్ఎస్ విజయానికి బాసటగా నిలిచాయి. ఇవేకాకుండా కేసీఆర్ ‘కంటి వెలుగు’, ‘అమ్మబడి’, ‘ఉచిత కరెంట్’ తదితర వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు.

తాజాగా తెలంగాణలో మరో రెండు పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో తెలంగాణ ప్రభుత్వం నూతన పథకానికి తీసుకురానుంది. ఈ పథకంలో ఐదుగురు బీసీ యువకులను ఒక గ్రూపుగా చేసి అంబులెన్స్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున బీసీశాఖ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. అదేవిధంగా 10వేల మంది మహిళలకు శిక్షణనిచ్చి కుట్టుమిషన్లు పంపిణీ చేయనుంది. చదువుకున్న యువతులకు నిఫ్ట్ లో శిక్షణ ఇప్పించనున్నారు. 11  ఫెడరేషన్ల  ద్వారా కుల వృత్తుల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలను కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసింది.

మరోవైపు ఏపీ కూడా సంక్షేమంలో తెలంగాణతో పోటీపడుతోంది. ఇటీవల ఏపీలో బ్రహ్మండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తున్నారు. రాజన్నను మరిపించేలా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విద్య, వైద్యం, కనీస సదుపాయాల కల్పనే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలను వైసీ ప్రభుత్వం చేపట్టింది. తాజాగా జగన్మోహన్ రెడ్డి మరొక కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

ఏపీ ప్రభుత్వం త్వరలోనే ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ చిరునువ్వు’ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. జులై 8న నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఈ పథకం కింద 1 నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత దంత వైద్యం అందించనుంది. ప్రతి విద్యార్థికి టూత్ పేస్టు, బ్రష్ ఉచితంగా ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. పీహెచ్‌సీలలో డెంటల్ చెకప్ కూడా ఉండాలని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ ఉండేలా చూడాలని అధికారులను సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వ బడుల్లో చదవే పిల్లల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం, ఇంగ్లీష్ స్కూల్ ప్రతిపాదనలు వంటి చేపట్టింది. ఏదిఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు సంక్షేమంలో పోటీపడుతుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News