ఏపీ సీఎం జగన్ మామ, వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా నేరుగా పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్బంగా మామను కడసారి చూసి సీఎం జగన్ భావోద్వేగం ఆపుకోలేకపోయారు. ఆయనను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక జగన్ తోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇక తమ అభిమాన డాక్టర్ ను కడసారి చూసేందుకు గంగిరెడ్డి అభిమానులు, అనుచరులు, బంధువులు పెద్ద ఎత్తున పులివెందుల తరలివచ్చారు. గంగిరెడ్డి మృతిపట్ల గవర్నర్ హరిచందన్ సంతాపం తెలిపారు.
ఇటీవల అస్వస్థతకు గురైన జగన్ మామ గంగిరెడ్డిని హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ ఈసీ చిన్న గంగిరెడ్డి మరణం వారింట విషాదం నింపింది.కడప జిల్లా వేముల మండలం గొల్లల గూడూరుకు చెందిన ఆయన ప్రముఖ వైద్యుడు. ఆయన అంత్యక్రియకలు ఈరోజు మధ్యాహ్నం అక్కడే నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు జగన్ హాజరు కానున్నారు.
2001-05లో పులివెందుల ఎంపీపీగా గంగిరెడ్డి గెలిచారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు గంగిరెడ్డి పాదయాత్ర చేసి వార్తల్లో నిలిచారు. పేదల పక్షపాతిగా గంగిరెడ్డి పేరు గాంచారు. ఆయన మరణంతో పులివెందుల మొత్తం కదలి ఆయనకు నివాళులర్పించేందుకు భారీగా కదిలివచ్చారు.