రోటీన్ కు భిన్నమైన వాదనల్ని వినిపించటం అందరికి సాధ్యమయ్యేది కాదు. కొందరునేతలు ఇలాంటి వాదనల్ని వినిపించటమే కాదు.. నిజమే కదా? అన్న భావన కలిగేలా చేస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. ఇటీవల కాలంలో కేసీఆర్ మనసు దోచుకునేలా మాటలు మాట్లాడుతున్న జగ్గారెడ్డి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపాలైన ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఓదార్చాల్సిన అవసరం లేదని.. గతంలో సైన్యంలో పని చేసిన ఉత్తమ్ చాలా ధైర్యవంతుడని ప్రశంసించారు. తాజాగా ఎదురైన ఓటమి కారణంగా సానుభూతితో ఉత్తమ్ హీరో అయ్యారని.. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పిన రేవంత్ మాత్రం జీరో అయ్యారని వ్యాఖ్యానించారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఉత్తమ్ కు పోయేదేమీ ఉండదని.. ఆయన పదవి ఎక్కడికి పోదన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అధికారపార్టీకి అనుకూలంగా వస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. గతంలో టీఆర్ ఎస్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వేళలో కూడా అధికార పార్టీలే గెలుపొందాయన్న విషయాన్ని మర్చిపోకూడదన్న జగ్గారెడ్డి మాటలు వింటే.. ఈ కాంగ్రెసోళ్లకు తమలో తాము కొట్టుకోవటం ఇక ఎప్పటికి ఆపరా? అన్న భావన కలుగక మానదు.