హుజూర్‌ నగర్ లో ఓడిపోయిన ఉత్తమ్ హీరోనే..జగ్గారెడ్డి

Update: 2019-10-29 08:16 GMT
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కొన్ని రోజులుగా ఎక్కువైపోయాయని అందరికి తెలిసిందే. పార్టీలో పట్టు నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా పోరాడుతున్నారు. ఇదే నేడు కాంగ్రెస్ ని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఒకప్పుడు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం ఉనికిని కోల్పోయే స్థితికి దిగజారింది. పార్టీలో కీలకనేతలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పనిచేయడంలో విఫలం అవుతున్నారు. దీనితో అది పక్కవారికి మేలు చేకూర్చుతుంది.

ఇక తాజాగా తెలంగాణలో హుజూర్‌ నగర్ లో ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన భార్యని ఎమ్మెల్యే గా పోటీ చేయించారు. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా టిఆర్ ఎస్ నేతలకి పోటీగా ప్రచారం కూడా చేసారు. కానీ , ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ మరోసారి చిత్తైపోయింది.

ఈ ఉపఎన్నికల ఫలితాలతో మరోసారి పార్టీలోని విభేదాలు భగ్గుమంటున్నాయి. ఓ వైపు సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బాధలో ఉన్న ఉత్తమ్‌ కుమార్ రెడ్డిపై.. అదే పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు హుజూర్‌ నగర్‌ లో ఉత్తమ్‌ పద్మావతి ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి హీరో అయ్యారంటూ జగ్గారెడ్డి తెలిపారు. ఒకవేళ హుజూర్‌ నగర్‌ లో ఉత్తమ్ పద్మావతి గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడని అన్నారు. దీనితో పార్టీలో విబేధాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సైన్యం లో చేసిన ఉత్తమ్ ఈ ఒక్క ఓటమితో క్రుంగిపోడు అని - యుద్ద విమానంలో దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన వ్యక్తి ఉత్తమ్ అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. హుజూర్‌ నగర్‌ లో ఓడిపోయినంత మాత్రాన ఉత్తమ్‌ కు వచ్చిన నష్టం ఏం లేదని. ఆయన పార్టీ పదవి ఎక్కడికి పోదన్నారు. ఉపఎన్నికలు ఎక్కడ జరిగిన ఫలితాలు అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతాయని ,  ఉపఎన్నికలు ఎప్పుడు కూడా ఏ పార్టీకి రెఫరెండం కాదని తెలిపారు.
Tags:    

Similar News