ప్రభుత్వ మాజీ విప్ - కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియస్ జగ్గారెడ్డి మరోమారు తనదైన శైలిలో తెరమీదకు వచ్చారు. మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదం కేంద్రంగా సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పడేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని వివాదంలోకి దింపారు. ఏకంగా హెచ్చరికతో కూడిన ప్రతిపాదనను ప్రధానమంత్రి ముందు పెట్టారు. కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి గజ్వేల్ వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్వాసితుల ఆక్రందనను వినాలని ప్రధానిని జగ్గారెడ్డి కోరారు.
జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ....మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వేలాదిమంది రైతులను సొంత ఊళ్ల నుంచి పంపిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే భూ బాధితుల సమస్యలు విన్నవించడానికి అనుమతించాలని ప్రధాన మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా అధికారవర్గానికి విన్నవించారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది కార్యకర్తలను కూడగట్టుకొని ప్రధాని బహిరంగ సభను ముట్టడించి నిరసన వ్యక్తం చేస్తామంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రధానమంత్రి బహిరంగ సభను పకడ్బందీగా పూర్తిచేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. మెదక్ జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన అధికారులు, కానిస్టేబుళ్లతో పాటుగా పొరుగు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. కోమటిబండతో పాటు బహిరంగ సభ ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అణువణువునా శోధిస్తున్నారు. మరోవైపు మొదటిసారిగా వస్తున్న ప్రధానికి తమ సత్తా ఏమిటో చాటుకోవాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ జన సమీకరణలో నిమగ్నమైంది. ప్రతి గ్రామం నుండి ఒక బస్సు చొప్పున సుమారు 2 లక్షల మందిని సభకు తరలించి విజయవంతం చేసేలా ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపిలు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్కంఠ భరింతంగా సాగే ప్రధాని సభ సజావుగా సాగుతుందా లేక ఇబ్బందికరంగా మారుతుందా? అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది.