బడుగు, బలహీనవర్గాల కేటగిరీలో...ప్రభుత్వ పథకాలను పొందాలంటే...అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్డు. కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే అందించేందుకు పాలకులు ప్రవేశపెట్టిన ఈ సౌలభ్యం...ఇప్పుడు పథకాలన్నింటికీ...తప్పనిసరి అయిపోయింది. అయితే, ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కొత్త ప్రతిపాదనను తెచ్చింది. రేషన్ కార్డు స్థానంలో మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టనుంది. వివిధ అవసరాలకు ఈ కార్డులు ఉపయోగిస్తామని, అయితే...పాత రేషన్ కార్డు మాత్రం రద్దు కాదని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలుపుతోంది.
ప్రభుత్వం యొక్క కీలకమైన సంక్షేమ కార్యక్రమాలకు..రేషన్ కార్డును ఏకైక అర్హతగా తీసుకోకుండా...ఆయా అంశాలకు ఒక్కో దానికి ఒక్కో కార్డును జగన్ సర్కారు ప్రవేశపెట్టనుంది. బియ్యం కార్డు, పింఛన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, ఫీజు రీయంబర్స్‌మెంట్ కార్డు పేర్లతో వేర్వేరుగా కార్డులను అందజేయనుంది. అంటే.. రేషన్ షాపులో బియ్యం కార్డు, ఉచిత వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీ కార్డు, చదువు విషయంలో ఫీజు రియంబర్స్‌మెంట్ కార్డు, పింఛన్ పొందే వారి కోసం పింఛన్ కార్డులను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట.
పాత రేషన్ కార్డులకు బదులుగా...నూతన కార్డులను అందుబాటులోకి తెచ్చే ఈ నిర్ణయం ఈ నెల 20వ తేదీ అమల్లోకి రానుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. ఎంపికైన అర్హులకు జారీ చేస్తారు. ఈ కార్డులను అందించడం వల్ల ఆయా పథకాలు పక్కదారి పట్టే పరిస్థితి ఉండదని, అర్హులకే సరైన పథకాలు చేరుతాయని ప్రభుత్వం భావిస్తోంది.