జైరాంను క‌దిలించి వాత పెట్టించుకున్న బాబు

Update: 2018-04-03 11:54 GMT
కొంత‌మందితో ఎంత త‌క్కువ‌గా మాట్లాడితే అంత మంచిది. చేయాల్సిందంతా  చేసి.. త‌న‌కేం సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం బాబుకు అల‌వాటు. ఆయ‌న్ను మోసే మీడియా.. బాబులోని నెగిటివ్ అంశాల్ని అస్స‌లు ట‌చ్ చేయ‌క‌పోవ‌టంతో.. ఆయ‌న చేసిన త‌ప్పుల్ని అంద‌రూ మ‌ర్చిపోతుంటార‌ని బాబు ఫీల‌వుతుంటారేమో? ఎందుకంటే.. తాజాగా చోటు చేసుకున్న సీన్ చూస్తే.. ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. పార్ల‌మెంటుకు వెళ్లారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మెట్ల‌కు మొక్క‌టం ద్వారా సీన్ క్రియేట్ చేసి.. ఫోటోగ్రాఫ‌ర్ల‌కు పండ‌గ చేసుకోడంటంటూ ఫోజులిచ్చిన ఆయ‌న.. త‌ర్వాత కూడా త‌ప్పుల మీద త‌ప్పులు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో ప‌లువురు నేత‌ల‌తో మాట‌లు క‌దిపిన బాబు.. కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్ తోనూ మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు. ఈసంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న‌కు ఎదురుప‌డిన జైరాంతో మాట్లాడిన చంద్ర‌బాబు.. రాష్ట్రాన్ని మీరే విభ‌జించార‌ని బాబు అన‌గా.. దానికి ఘాటు కౌంట‌ర్ జైరాం ర‌మేష్ నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. మీరు రాష్ట్రాన్ని విభ‌జించాల‌ని లేఖ ఇచ్చారు.. ఆ త‌ర్వాతే విభ‌జ‌న జ‌రిగింద‌న్న మాట రావ‌టంతో బాబు కంగుతిన్న‌ట్లుగా చెబుతున్నారు. జైరాం ర‌మేష్ కౌంట‌ర్ తో బాబు మాట్లాడ‌లేక‌పోయార‌ని.. త‌ర్వాత క‌లుద్దామ‌ని జైరాంకు బై చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

పార్ల‌మెంటుకు వ‌చ్చిన చంద్ర‌బాబు.. ప‌లువురు నేత‌ల‌తో మాట‌లు క‌దిపారు. అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌.. ఎన్సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్‌.. సుప్రియా సూలె.. తారిక్ అన్వ‌ర్.. టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ‌.. డెరిక్ ఒబ్రెయిన్.. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్‌.. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లా.. టీఆర్ ఎస్ నేత జితేంద‌ర్ రెడ్డిల‌తో స‌మావేశ‌మ‌య్యారు. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లో హ‌డావుడి చేసిన బాబు తీరు ప‌లు సంద‌ర్భాల్లో కామెడీ గా మార‌న‌ట్లుగా ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News