పోలీస్ సిబ్బంది సంయమనం కోల్పోవడం - రాజకీయ నేతల దూకుడుతో కరీంనగర్ జిల్లా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులపై పోలీస్ ఒకరు తుపాకి ఎక్కుపెట్టడం కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ చేపట్టిన నిరసనలో భాగంగా ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆందోళన చేశారు. అయితే శాంతి భద్రతల కోణంలో విజయరమణారావును పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన్న కలిసేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి - పలువురు జిల్లా నాయకులు వెళ్లగా ఈ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పార్టీ ముఖ్యనేతలైన రేవంత్ రెడ్డిని - రైతు విభాగం నాయకుడిని మాత్రమే లోపలికి అనుమతించేందుకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే జిల్లా తెలుగుదేశం నాయకులు సైతం తాము లోనికి వెళతామని వాదులాటకు దిగారు. ఈ క్రమంలో జైలు సిబ్బంది వారిని అడ్డగించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న సెంట్రీ పోలీసు సహనం కోల్పోయాడు. స్థానిక టీడీపీ నాయకులపై తుపాకీ ఎక్కుపెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశాడు, అంతేకాకుండా నోటికొచ్చినట్లు దూషించాడు. దీంతో టీడీపీ నేతలు సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటుతుండటం గమనించిన మిగతా సిబ్బంది టీడీపీ నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం ఆ సెంట్రీకి సదర్దిచెప్పారు. ఈ పరిణామంపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. శాంతి భద్రతలు కాకుండా టీఆర్ ఎస్ నాయకులకే భద్రత అన్నట్లుగా పరిస్థితి మారిపోతోందని మండిపడ్డారు.