ఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్ లేనోళ్లు చాలా తక్కువమంది. స్మార్ట్ ఫోన్లు వాడే వారికి యాప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఒక యాప్ కానీ స్మార్ట్ ఫోన్ లో లేకుండా వెయ్యి రూపాయిల ఫైన్ తో పాటు.. ఆర్నెల్లు జైలుశిక్షకు అవకాశం ఉంటుందా? అంటే నో అనేస్తారు. కానీ.. తొందరపడి అలా చెబితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. గ్రేటర్ నోయిడా ప్రాంత పోలీసులు కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇంతకీ ఆ యాప్ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం.
కోవిడ్ 19కు సంబంధించి లేటెస్టు ఆప్డేట్స్ తోపాటు.. మీరుండే ప్రాంతం సేఫ్ గా ఉందా? అదనపు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? లాంటి అంశాలు కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఇప్పటివరకూ 10 కోట్ల మందికి దీన్ని డౌన్ లోడ్ చేసుకున్నారు. అంతేకాదు.. కొన్ని ఆఫీసుల్లోకి అనుమతించాలంటే.. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవమే కాదు.. దీనికి సంబంధించిన సమాచారాన్ని చూపిస్తే కానీ పోలీసులు అనుమతించటం లేదు.
ప్రస్తుతం కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోుతున్న వేళ.. వివిధ మహానగరాలకు కొత్త ఐడియా ఇచ్చేలా ఒక కొత్త విధానాన్ని గ్రేటర్ నొయిడాలో అమలు చేస్తున్నారు పోలీసులు. దీని ప్రకారం రోడ్డు మీదకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవటమే కాదు.. దాన్ని వినియోగిస్తున్న వైనాన్ని పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని తాము ఉపేక్షించమని చెబుతున్నారు.
గ్రేటర్ నోయిడా రోడ్ల మీదకు వచ్చేవారంతా తమ స్మార్ట్ ఫోన్లో తప్పనిసరిగా ఆరోగ్య సేత యాప్ ను వినియోగిస్తూ ఉండటం చాలా అవసరమని చెబుతున్నారు. బయట తిరిగే వారి పోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను పోలీసులకు చూపిస్తూ ఉండాలి. ఇప్పటివరకూ మాస్కులు లేకుండా బయటకు రావటం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వూసే వారికి ఫైన్ వేస్తున్నారు.
అంతేకాదు.. రోడ్డు మీదకుమాస్కులు లేకుండా వచ్చే వారికి ఫైన్లు తప్పట్లేదు. అంతే కాదు.. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారంతా ఆరోగ్య సేతు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోకపోవటాన్ని నేరంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు అదనపు డిప్యూటీ కమిషనర్ వల్లడించారు. నోయిడా మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు.. పట్టణాల్లో బయటకు వచ్చే ప్రజలంతా తమ స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరి చేస్తే.. మరింత సేఫ్ గా ఉండొచ్చని చెప్పక తప్పదు.