పసుపు పార్టీకి....లోకమంతా పచ్చనే...

Update: 2018-08-08 11:09 GMT
ప్రజా ప్రతినిధులంటే ఎవరు..... ప్రజాప్రతినిధులు ఎక్కడినుంచి వస్తారు.. ఓ రాజకీయ పార్టీ సిధ్దంతాలను ఆచరణను ప్రజలలో నమ్మకాన్ని సాధించుకుని ప్రజలనుంచే నాయకుడిగా వారి ప్రతినిధులుగా శాసనసభకు - లోక్‌ సభకు ఎన్నికవుతారు కదా.... అలాంటి ప్రజాప్రతినిధులు ప్రజలు కష్టాలలో ఉంటే వాటిని గాలికి వదిలేసి చర్చల పేరుతో ఏసీ రూములో కూర్చుంటారా... ఆ పనే చేయాలని గోడ దూకిన శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అంటున్నారు. ఒక పార్టీ పై విశ్వాసం ఉంచి వేసిన ఓట్లను ఆ ప్రజలను మోసం చేసి అధికారం కోసం పార్టీ మారిన జలీల్ ఖాన్ కు ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్న  వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మేల్యేలు గొర్రెలలా కనబడతారా... పచ్చ పార్టీ వారికి లోకమంతా పచ్చగానే  కనబడుతోంది.  ఇదే సామేత గొర్రెలు అన్న పదం ఉపయోగించిన నాయకులకు వర్తిస్తుంది.

 ప్రత్యేక హోదా వస్తే బతుకులు బాగుపడతాయని జీవితాలు స్దిరపడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించారు. అందుకోసం కలలు కన్నారు. అయితే జలీల్ ఖాన్ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కలలను కల్లలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాలు అడియాశాలు చేసారు. దీనిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోంది. దానికి ఆ పార్టీ ఎమ్మేల్యేలు ఎండనక వాననక - పగలనక రాత్రనక - ఉద్యమిస్తున్నారు. అలాంటి వారికి చేయూతనివాల్సింది పోయి  జంతువులతో పోల్చాడం జలీల్ ఖాన్ అవివేకానికి అమర్యాదకి పరాకాష్ట.రాష్ట్రం ఓ పక్క రాష్ట్రం రగిలిపోతూ ఉంటే అక్కడ చలికాచుకోవాలనుకోవడం జలీల్ ఖాన్ వంటి నాయకులకే   చెల్లింది.  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మేల్యేలకు జీతాలెందుకని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం నాయకులు ప్రజల కోసం తమ జీతాలలోంచి ఒక్క రూపాయైన ఇవ్వగలరా, ఇచ్చిన దాఖాలాలున్నాయా. అందికాటికి దోచుకుంటున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రతిపక్షా నాయకుల పోరాటం నచ్చుతుందని అనుకోవడం శుద్ద దండగా.


Tags:    

Similar News