చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూడా ఇప్పుడు రెండు ఖాళీలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన వారు ఇద్దరూ తప్పుకోవడంతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎటూ ఎన్నికల సంవత్సరమే కనుక మీనమేషాలు లెక్కించకుండా వీటిని వెంటనే భర్తీ చేసే చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇటు ఇప్పుడు భాజపాతో స్నేహం లేదు గనుక ముస్లిం వర్గానికి చెందిన ఒకరికి మంత్రి పదవి కట్టబెడితే... ఆ వర్గం నుంచి గరిష్టంగా లబ్ధి పొందవచ్చునని చంద్రబాబునాయుడు యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామం ఏమిటంటే ఆ పోటీలో విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అవకాశం పొందవచ్చునని అంతా అనుకుంటున్నారు.
విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటే తెలిసిన వాళ్ళు బహుశా కొద్దిమందే ఉంటారు. కానీ ‘బీకాంలో ఫిజిక్స్ చదివిన మేధావి’, అంటే తెలియని వాళ్ళు రెండు రాష్ట్రాల్లోనూ ఉండరు. అలాంటి జలీల్ ఖాన్ ముస్లిం కోటాలో ఇప్పుడు మంత్రి కాబోతున్నట్లుగా పార్టీవర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. ఆయన తెదేపాలో చేరుతున్న సమయంలో నేనే మంత్రి పదవి గురించి చంద్రబాబు హామీ ఇచ్చారని ఒక ప్రచారం ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన విస్తరణలో రకరకాల సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఇటూ రెండు ఖాళీలు అయ్యాయి కనుక ఒక జలీల్ ఖాన్ కు దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. పైగా భాజపాతో తెగతెంపులు చేసుకున్న వ్యవహారం ముస్లిం వర్గాలలో ఆదరణ తెస్తుందని - తెదేపాకు ఒక నమ్మకం ఉంది. దానికి తోడు ఆ వర్గానికి చెందిన వారికి ఒక మంత్రి పదవిని కూడా కేటాయిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వారు లెక్క వేస్తున్నారు.
ఎటు తెలుగుదేశం పార్టీలు ముస్లిం వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. ఉన్నదల్లా వైకాపా నుంచి ఫిరాయించిన వారు మాత్రమే. కనుక వారిలో సీనియర్ అయిన జలీల్ ఖాన్ కు మంత్రి పదవి తప్పదని ఊహాగానాలు నడుస్తున్నాయి. పదవి అంటూ వస్తే ఆయనకు దక్కింది మైనార్టీ మంత్రిత్వశాఖ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆ మంత్రిత్వ శాఖలో కూడా ఎన్ని పిజిక్స్ లెక్కన వ్యవహారాలు జలీల్ ఖాన్ చిత్రవిచిత్రంగా నడిపిస్తారో అనే మాటలు నెటిజన్లలో వినపడుతున్నాయి.