టీడీపీతో జనసేన పొత్తు... ఒకే ఒక్క కండిషన్...?

Update: 2022-10-21 11:30 GMT
ఏపీలో పొత్తుల మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి విజయవాడలోని ఒక హొటల్ లో కలుసుకుని మాట్లాడారు. ఆ తరువాత మీడియా ముందుకు ఇద్దరు నేతలు వచ్చి ఏపీలో వైసీపీ పాలన మీద తాము ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకుంటామని అన్నారు. ఇక్కడి దాకా చూస్తే కేవలం కర్టసీ భేటీ మాత్రమే అని జనసేన వర్గాలు అంటున్నాయి.

అయితే ఇంతకు మించి ఉంది. పొత్తులు రెండు పార్టీలు పెట్టుకుంటాయని రాజకీయ విశ్లేషణలు పెద్ద ఎత్తున చేసే వారు మాత్రమే  చెబుతున్నారు. చూడబోతే పరిణామాలు ఆ విధంగానే ఉండవచ్చు కూడా అన్న వారూ ఉన్నారు. అయితే ఈ పొత్తుల మీద అటు టీడీపీ ఇటు జనసేనలో ఏ రకమైన స్పందనలు ఉన్నాయని అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సహజంగానే టీడీపీలో దీని మీద ఒకింత ఆనందం కనిపిస్తోంది. అదే జనసేనలో భిన్నమైన రియాక్షన్ ఉంది.

టీడీపీలో అయితే  చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారు ఆయనే కావాలి అన్న వాదన ఉంది. జనసేనలోనూ అలాంటి వాదన వినిపించే వారు ఇపుడు కనిపిస్తున్నారు. తాజాగా ఆస్క్ నాగబాబు అంటూ ట్విట్టర్ లో మెగా బ్రదర్ ఇంటరాక్షన్ సెషన్ పెడితే పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్న జనసైనికులు టీడీపీ పొత్తు ఉన్నా మాకు అభ్యంతరం లేదు, అయితే పవన్ కళ్యాణ్ణి మాత్రం చీఫ్ మినిస్టర్ అభ్యర్థిగా  ప్రకటించాల్సిందే. ఒకే ఒక్క కండిషన్ ని అంగీకరించాలని కోరడం విశేషం.

పవన్ కళ్యాణ్ణి సీఎం అభ్యర్ధిగా ప్రకటించాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగేలా చూడాలని కోరుతున్నారు. అదే టైం లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పాలని కూడా నాగబాబుని జనసైనికులు అడిగారు. అలాగే చిరంజీవి మద్దతు జనసేనకు ఉందా, ఆయన ప్రచారం చేస్తారా అని కూడా అడుగుతున్నారు.

మొత్తానికి మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఎక్కువ మంది మాత్రం పవన్ కళ్యాణ్ ఈసారికి సీఎం కావాల్సిందే అంటున్నారు  ఈ విషయంలో రాజీ పడవద్దు అని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో వారికి అక్కడికక్కడ నాగబాబు  ఏమీ చెప్పేది ఉండదు కానీ, ఆయన జనసైనికుల మనోగతాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ కి తెలియచేస్తారు అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈసారి జనసైనికులు అయితే టీడీపీతో పొత్తును అంత సాఫీగా ఒప్పుకోరని కూడా అంటున్నారు. ఒక వేళ తమ మాటను కాదని పొత్తులు పెట్టుకునా ఆ మీదట రెండు పార్టీలు పనిచేయడం సఖ్యతగా ఉండడం మీద కూడా సందేహాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News