పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాడు. వచ్చే ఏడాది ఏపీలో జరుగబోతున్న ఎన్నికలపై పవన్ దృష్టి పెట్టాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీలో విస్తారంగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో పర్యటించాడు. ఈ సందర్బంగా అక్కడ ముస్లీంలతో భేటీ అయ్యాడు. పలువురు ముస్లీంలు పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేనకు సంఫీుభావం తెలిపారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అమెరికా ట్విన్ టవర్స్ సంఘటన సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. ఆ సమయంలో నేను గడ్డం బాగా పెంచుకుని ఉన్నాను. నన్ను చూసిన కొందరు అమెరికన్స్ నన్ను ముస్లీం వ్యక్తిగా భావించి - ఏమైనా చేస్తానేమో అనే భయం వ్యక్తం చేశారు. నన్ను వింతగా చూడటంతో పాటు - భయం భయంగా వారు నన్ను చూసేవారు. అప్పుడే నాకు అర్థం అయ్యింది. ముస్లీంలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో - వారు పడే ఇబ్బందులు ఏంటో. ప్రతి మతంలో కూడా మంచి వారు చెడ్డ వారు ఉంటారు. అలాగే ముస్లీం మతంలో కూడా మంచి వారు ఉన్నారు.
ఒక మతంకే చెందిన వారిని ఉగ్రవాదులుగా భావించడం ఏమాత్రం సమంజసం కాదని పవన్ అన్నారు. ముస్లీంలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయి తప్ప ఏ ఒక్కరు కూడా ముస్లీంలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం లేదు అన్నాడు. ముస్లీం వర్గాల్లో చాలా మంది ఉన్నతులు ఉన్నారని - వారి అభివృద్దికి తోడ్పడాలని పవన్ కోరాడు.