ఆచితూచి మాట్లాడాలన్న సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్ని చూస్తే అర్థమవుతుంది. పార్టీకి సంబంధించి కానీ.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ గురించి ఎక్కువ వివరాలు చెప్పకుండా.. త్వరలోనే వెల్లడిస్తామంటూ వాయిదాల మీద వాయిదాలు వేసే తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ సన్నిహితులు.
పార్టీ అంతర్గత నిర్మాణం జోరుగా సాగుతుందని చెబుతున్నప్పటికీ.. అలాంటి దాఖలాలు ఏమీ కనిపించని పరిస్థితి. పార్టీలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి పవన్ సన్నిహితులు గొప్పలు చెప్పినా.. వాస్తవంలో వర్క్ వుట్ అయ్యేవి ఎంతమేరకు? అన్న సందేహం పలువరిని పట్టి పీడిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా విజయవాడలో పవన్ పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెజవాడలో జనసేన పార్టీ రిసోర్స్ పర్సన్ల వడపోత కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మహేంద్రరెడ్డి.
త్వరలోనే పార్టీ అధినేత కార్యచరణను ప్రకటిస్తారని వెల్లడించిన ఆయన.. కొద్ది రోజుల్లోనే పవన్ జిల్లాల్లో పర్యటిస్తారని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ 2018 మార్చిలో పెద్ద మార్పు రానున్నట్లుగా చెప్పారు. త్వరలోనే పవన్ కల్యాణ్ జనం మధ్యకు వచ్చి.. సరికొత్త ప్రభంజనానికి శ్రీకారం చుట్టనున్నట్లుగా పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో 60 నుంచి 65 శాతం వరకు కొత్తవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ తమకు చెప్పినట్లుగా జనసేన పార్టీ మీడియా వ్యవహారాలు చూసే హరిప్రసాద్ వెల్లడించారు. ఇంతటి కీలక నిర్ణయాన్ని పవన్ కాకుండా.. పవన్ చెప్పినట్లుగా పార్టీ మీడియా వ్యవహారాలు చూసే హరిప్రసాద్ చెప్పటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.