2019 ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాల్ని చేస్తానంటూ పవర్ స్టార్ పవన్ పేర్కొనటం తెలిసిందే. అయితే.. ఎవరైనా ఒక పార్టీ పెట్టాలని అనుకున్నా.. పార్టీ పెట్టినా నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులు చాలానే ఉంటాయి. రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వటం.. వాటికి గుర్తింపు లభించటం లాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. పార్టీకి సంబంధించిన గుర్తింపునకు అవసరమైన పత్రాల్ని ఎన్నికల సంఘంలో దాఖలు చేశారు.
నిబంధనల ప్రకారం జనసేన పార్టీపై ప్రజాభిప్రాయాన్ని సేకరించటం.. వాటిని పరిశీలించటం అనంతరం పార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వటం చేస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు రాజకీయపార్టీ హోదా దక్కటం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ జనసేనను రాజకీయ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం ప్రకటించింది.
జనసేనకు రాజకీయ పార్టీ హోదాకు సంబంధించిన పత్రాల్ని పవన్ కల్యాణ్ తో పాటు.. ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్లకు పత్రాలు అందాయి. పొలిటికల్ పార్టీగా జనసేనను గుర్తించిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీకి గుర్తును మాత్రం కేటాయించలేదు. కాకుంటే.. స్వతంత్రంగా పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల కంటే జనసేనకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే.. ఎన్నికల సంఘం సూచించిన గుర్తుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కలుగనుంది. ఈసీ గుర్తింపు నేపథ్యంలో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీ హోదా దక్కినట్లే.