ఏపీలో ఆర్థిక రాజధానిగా భావిస్తున్న బెజవాడలో ఆర్థిక నేరాలు కూడా ఎక్కువే. ఏ చిన్న అవకాశం దొరికినా కోట్ల కుంభకోణాన్ని జరిపేందుకు కొందరు అస్సలు వెనుకాడరు. ప్రభుత్వాలు ఏవీ ఉన్నా కొందరు బెజవాడ కేంద్రంగా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. భూ కుంభకోణాలు, మనీ లాండరింగ్ లాంటి కేసుల్లో విజయవాడ ఎప్పుడూ ముందు వరుసలో ఉండడం ఆలోచించాల్సిన విషయం. తాజాగా దేవాలయ భూముల ఫ్రాడింగ్లో మరోసారి బెజవాడ పేరు మారుమోగుతోంది. అయితే సాక్షాత్తూ దేవదాయ శాఖ కు చెందిన మంత్రిగారిమీదే ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంతో కొంత డబ్బు కూడబెట్టుకోవడం సహజమే. కానీ ప్రభుత్వ ఆస్తులను ఆసరాగా చేసుకొని అందినంద దండుకోవడమే అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా భూముల వ్యవహారంలో ప్రజాప్రతినిధులు తలదూర్చడం తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకొని విలువైన భూములను సొంతం చేసుకోవడం జరగుతూనే ఉన్నాయి. అయితే కొందరు ఇలాంటివి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా... ఏదో రకంగా బయటపడుతున్నాయి. తాజాగా విజయవాడ కేంద్రంగా దేవాలయానికి సంబంధించిన భూముల విషయంలో ఓ మంత్రి తక్కువ ధరకే భూమిని దక్కించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విజయవాడ మండలంలోని జక్కంపూడి పంచాయితీకి చెందిన అప్పలస్వామి సత్రం ఆధ్వర్యంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇందులో 2.5 ఎకరాలు తము వారసత్వంగా వచ్చిందని, ఆ భూమిపై తమకు హక్కులు ఇవ్వాలంటూ భోగవల్లి కుటుంబ సభ్యులు గతంలో ఎన్ వోసీ కోసం ఆర్జీ పెట్టుకున్నారు. అయితే ఇదే అదనుగా తీసుకున్న సదరు మంత్రి ఎన్ వోసీ సంతకం కావాలంటే తనకు అనుకూలంగా ఓ పని చేసి పెట్టాలని మెలిక పెట్టడాట. వారికి సంబంధించి ఓ భవనాన్ని తన మిత్రునికి తక్కువ ధరకు విక్రయించాలని ఒప్పందం చేసుకున్నాడట. ఇప్పుడు ఆరోపణలు మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి అడిగిన ఆ భవనంతో కూడిన స్థలం విస్తీర్ణం 738 గజాలుంటుంది. విజయవాడలోని ఏలూరు రోడ్డులో అప్సర థియేటర్ కు సమీపంలో ఈ స్థలం ఉండడం వల్ల దీని విలువ భారీగానే ఉందట.. తక్కువ తక్కువ మార్కెట్లో 8 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే దీనిని కేవలం రూ. 10 లక్షలకు అమ్మాలని మంత్రి ఓఎస్టీ తన స్నేహితుడి పేరుమీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్ వోసీ రాని స్థలాన్ని కూడా తక్కువ ధరకే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ వోసీ వచ్చాక ఆ 738 విస్తీర్ణం కలిగిన స్థలాన్ని ఓఎస్డీ స్నేహితుడికి అమ్మాలన్నది ఒప్పందం. అయితే ఎన్ వోసీ రాకముందే ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని స్థలం యజమానులపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ విషయం బయటికి రావడంతో రచ్చ రచ్చయింది. ఈ భూముల వ్యవహారంలో మంత్రి హస్తముందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ భూములు కాపాడాల్సిన వారే ఇలాంటి అక్రమాలకు పాల్పడడం దారుణమంటూ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన విజయవాడలో ప్రస్తుతం భూముల రేట్లు అధికంగా పెరిగాయి. దీంతో గజం ప్లేసుకు లక్షకు పైగానే పలుకుతోంది. దీంతో కొందరు తమకు అందినంత భూమిని దక్కించుకుంటున్నారు. అయితే కొన్ని భూముల వ్యవహారాలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడం ద్వారా ఇలా బయటికి వస్తున్నాయి. ఇలా బయటికి రాకుండా అనేక భూ దందా జరుగుతుందని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా దేవాదాయ భూముల వ్యవహారంలో మంత్రి పేరు వినిపించడంతో ఆయన ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.