సీమలో బాబు...కోస్తాలో లోకేష్. ఉత్తరాంధ్రాలో పవన్...?

Update: 2023-01-23 02:30 GMT
వైసీపీ మరోసారి గెలిస్తే ఏపీ అంధకారమే అని ఇప్పటికే విపక్ష నేతలు చెబుతూ వచ్చారు. మరోసారి వైసీపీ గెలవకుండా చేయాల్సింది అంతా చేస్తున్నారు. అందుకే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ఈ రెండు పార్టీల ఎన్నికల ప్లాన్ కూడా అదిరిపోయే లెవెల్ లో ఉంటోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మూడు ప్రాంతాలలో వైసీపీకి చావు దెబ్బ తీయడానికి తెలుగుదేశం జనసేన కలసి ఒక వ్యూహాన్ని రచించాయని అంటున్నారు.

దాని ప్రకారం రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు ఒక కాపు కాస్తే కోస్తా జిల్లాలలో నారా లోకేష్ ఒక చేయి వేస్తారు. ఇక ఉత్తరాంధ్రాకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక చూపు చూస్తారు అని అంటున్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మరో మారు పోటీ చేస్తారు. అంతే కాకుండా రాయలసీమలో తెలుగుదేశం జనసేన కూటమి గెలిచేలా ప్రణాళికలు రచిస్తారు అని అంటున్నారు.

ఇక కోస్తాకు ముఖద్వారంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేయడం ఖాయమైంది. లోకేష్ పోటీతో ఆ ప్రాంతాలు అన్నీ తెలుగుదేశం వైపుగా టర్న్ అవుతాయని భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రాకు గేట్ వే గా ఉన్న విశాఖ నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో తాను పోటీ చేసిన గాజువాక నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు.

దాని వల్ల ఉత్తరాంధ్రాలో ఆ ప్రాభవం బాగా పడుతుందని ఆశిస్తున్నారు. జగన్ మూడు రాజధానుల వ్యూహాన్ని అలా తిప్పికొట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. విశాఖకు పాలనా రాజధానిగా చేస్తూ రాయలసీమకు న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తూ కోస్తాకు అసెంబ్లీ అని జగన్ చెబుతున్నారు. అలా మూడు చోట్లా విపక్షానికి చోటు లేకుండా చేయాలని ఆయన ఎత్తు వేశారు.

దానికి ధీటుగా పై ఎత్తు వేస్తూ తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇపుడు స్కెచ్ గీస్తున్నాయని అంటున్నారు. ఎన్నికల లోపు జగన్ విశాఖకు తరలివస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఉత్తరాంధ్రా మీద మరింత ప్రభావం చూపవచ్చు అన్నది ఆయన ఆలోచన. మెజారిటీ సీట్లు మరొసారి ఇక్కడ గెలుచుకుంటేనే అధికారం సాధ్యపడదు అని తెలిసే వైసీపీ ఇలా చేస్తోంది. అయితే జగన్ ఆలోచనలను తిప్పికొట్టేలా పవన్ ఉత్తరాంధ్రాలో తిష్ట వేస్తారు అని అంటున్నారు.

అదే విధంగా పవన్ రాయలసీమ నుంచి కూడా రెండవ సీటుకు పోటీకి దిగుతారు అని అంటున్నారు. అది తిరుపతి కావచ్చు లేదా అనంతపురం కావచ్చు అని చెబుతున్నారు. ఈ రెండు చోట్లలో ఏదో దాంట్లో రెండవ సీటుగా పోటీ చేయడం ద్వారా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో దెబ్బ తీయాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే నందమూరి బాలక్రిష్ణ ఎటూ హిందూపురం నుంచి పోటీ చేస్తారు. ఇలా సీమను గుప్పిట పట్టే వ్యూహం కూడా ప్రత్యేకంగా రూపొందించారు అని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తూంటే జగన్ మీద ముప్పేట దాడికే బాబు పవన్ లోకేష్ కలసి చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఇదే నిజమైన పక్షంలో ధీటైన వ్యూహరచన వైసీపీ ఏమి చేస్తుందో.
Tags:    

Similar News