జనసేన పార్టీ శ్రేణుల కోసం ఎంపిక ప్రక్రియ ద్వారా ముందుకు సాగుతున్న పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో వేగం పెంచారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎంపిక పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ టీం తాజాగా మూడు జిల్లాల్లో జనసేన శిబిరాలను ఖరారు చేసింది. ఈ మేరకు తాజాగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ``ఈ నెల తొలి - రెండో వారాల్లో జనసేన ప్రతిభ పాటవ ఎంపిక శిబిరాలు ప్రారంభం అవుతున్నాయి. నెల్లూరు - ప్రకాశం - తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ మూడు జిల్లాల నుంచి స్పీకర్లు - కంటెంట్ రైటర్లు - అనలిస్ట్ విభాగాలకు ఏడువేలకు పైగా దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా అందాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు శిబిరం వేదిక వద్ద స్వయంగా దరఖాస్తులను అందించి పాల్గొనవచ్చు`` అని తెలిపింది.
సామాన్యులు,యువతీ యువకులు - మేధావులకు క్రియాశీలక రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించాలని తలపెట్టిన ఈ శిబిరాలకు చూపుతున్న ఆదరణ వెలకట్టలేనిదని జనసేన ప్రకటన విశ్లేషించారు. వేలల్లో అందుతున్న ధరఖాస్తులే నిదర్శనమని పేర్కొంది. నెల్లూరు జిల్లాలో ఈ నెల 6 - 7 తేదీలలో - ప్రకాశంలో 7 - 8 తేదీలలో - తూర్పుగోదావరిలో 10 - 11 తేదీలలోను ఈ శిబిరాలు జరుగనున్నాయని వెల్లడించారు. తూర్పుగోదావరిలో అవసరమైన పక్షంలో మరో రోజు కూడా ఈ శిబిరాన్ని పొడిగించే అవకాశం ఉందని తెలిపింది. శిబిరం సమయం, మిగిలిన వివరాలను ధరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారని వివరించింది. తెలంగాణాలో ఆదిలాబాద్ - నిజామాబాదు జిల్లాల్లో ఈ శిబిరాలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.
janasenaparty.org/nellore.pdf
janasenaparty.org/prakaam.pdf
janasenaparty.org/eastgodavari.pdf ద్వారా కూడా మూడు జిల్లాల్లో ఈ శిబిరాలు నిర్వహించే చిరునామాలను తెలుసుకోవచ్చునని వివరించింది.
జనసేన శిబిరాలు జరిగే ప్రాంతాలు
నెల్లూరు
శ్రీ కిలారి తిరుపతినాయుడు కల్యాణ మండపం,
డి.ఎస్.ఆర్. హాస్పిటల్ ఎదురుగా,
దర్గా మిట్ట,
జి.ఎం.టి.రోడ్, నెల్లూరు.
ప్రకాశం
వాసు ప్లాజా,
పేస్ కన్పల్జెన్సీ సర్వీసెస్,
ఈస్ట్ కేబి ఎదురుగా,
భాగ్యనగర్ 2వ లైన్,
ఒంగోలు.
తూర్పుగోదావరి
న్యూ సెంచరీ స్కూల్,
జె.ఎం.టి.యు. రెండో గేట్ ఎదురుగా,
వినాయక టెంపుల్ రోడ్,
లాల్ బహుదూర్ నగర్,
నాగమల్లితోట జంక్షన్ సమీపంలో
కాకినాడ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/