పార్టీలకు అతీతంగా.. ఎవరు మంచి చేస్తే ఫలానా వారు మంచి చేస్తున్నారని.. చెడ్డ చేస్తుంటే ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పేసే రాజకీయ నేతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గిపోయారనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జెండాను.. మరేదో ఎజెండాను పట్టుకొని మాట్లాడటమే కానీ.. తటస్థంగా మాట్లాడేవారే కరవైన పరిస్థితి .ఇలాంటి వేళ.. ఏపీలో అలాంటి నేతల్లో ఒకరిగా సీనియర్ నేత ఉండవల్లిని చెప్పాలి.మాజీ ఎంపీగా.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆయన.. రాజకీయ మేధావిగా చెప్పక తప్పదు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయం గురించి న్యాయంగా బాధ పడే అతి కొద్దిమందిలో ఆయన ముందుంటారు. ఇప్పటికి విభజన బిల్లు ఆమోదం పొందిన తీరుపై ఆయన న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఉండవల్లి గురించి తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు.
ఆయన ప్రస్తావనకు కారణం.. వైసీపీ నేతల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు పవన్.
ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణ పరిస్థితుల్లో ఉందన్న ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక హామీల్లో వేటిని అమలు చేయలేదన్నారు. "మద్యపాన నిషేధం అన్నారు చేయలేదు. కౌలు రైతులు చనిపోతే వారికి డబ్బులు ఇస్తామన్నారు ఇవ్వట్లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగులకు భ్రతి అన్నారు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏమీ జరగట్లేదు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయాయి'' అని చిట్టా విప్పారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఒక తటస్థ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్షేమం కోరే నాయకుడు ఒకరు కూడా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల్ని తిడుతున్నారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చని పవన్ వ్యాఖ్యానించారు. "ఒకవైపు కేంద్ర ప్రభుత్వం తిడతా ఉంటుంది వీళ్లు పట్టించుకోరు. అప్పులు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అప్పులు చేస్తున్నారు.. ఏమైనా డబ్బులు వస్తున్నాయా? అంటే రావట్లేదు. నిజంగా అప్పులు చేస్తుంటే.. కౌలు రైతు బ్యాంకు ఖాతాల్లోకి రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలి. పరిశ్రమలు రావాలి. మరి.. ఆ డబ్బులన్నిఎక్కడికి పోతున్నాయి? వాళ్ల అవసరాలకు వెళ్లిపోతున్నాయా? వాళ్ల ఓటు బ్యాంకు కోసం వెళ్లిపోతున్నాయా? అన్నది చూడాలి'' అని వ్యాఖ్యానించారు.
వైసీపీ తీరును తీవ్రంగా దుయ్యబడుతూనే.. జగన్ సర్కారు అమలు చేస్తున్న కొన్ని పథకాలకు తాను వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించటం గమనార్హం. ఆటో డ్రైవర్లకు ఇచ్చే ఆర్థిక సాయం.. స్కూలుకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో వేసే అమ్మఒడి పథకానికి తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేయటం చూస్తే.. జగన్ సర్కారు చేసే వాటిల్లో చెడునే కాదు.. మంచిని కూడా చూస్తున్నారని చెప్పాలి.