ఊహించని రీతిలో మాట్లాడటం.. మామూలు విషయాల్నే కొత్తగా చెప్పటం ప్రధాని మోడీకి అలవాటు. తాను ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఏ దేశానికి వెళ్లినా అక్కడి వారికి సైతం సరికొత్తగా అనిపించేలా మాట్లాడే అలవాటు దేశ ప్రధానిలో కనిపిస్తుంది. ఇలాంటి విలక్షణమైన లక్షణాన్ని జపాన్ ప్రధాని షింజో సైతం ప్రదర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
దేశ పర్యటనకు వచ్చిన సందర్భంగా జపాన్ ప్రధాని తన మాటలతో.. చేతలతో పలువురి దృష్టిని ఆకర్షించారని చెప్పాలి. విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భంగా ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ వస్త్రధారణ చేయటం మామూలే. కానీ..తన తాజా పర్యటనలో జపాన్ ప్రధాని ఇందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి. ప్రధాని మోడీ డ్రెస్ ను అనుకరించిన ఆయన భారత సంస్కృతి కంటే మోడీనే తనకు ప్రాధాన్యం అన్నట్లుగా వ్యవహరించారన్న మాట వినిపించింది.
డ్రెస్సింగ్ విషయంలోనే కాదు.. మాటల్లోనూ మోడీని షింజో ఫాలో అయినట్లుగా కనిపిస్తుంది. జపనీస్ లో మాట్లాడిన షింజో.. జపాన్ లోని మొదటి రెండు అక్షరాలైన జే..ఎ.. ఇండియాలోని మొదటి అక్షరమైన ఐను కలిపితే.. జై అవుతుందని.. జై జపాన్.. జై ఇండియా అని వ్యాఖ్యానించారు. ఇందుకోసం తాను.. మోడీ కలిసి పని చేస్తామని చెప్పారు. మోడీ హయాంలో చాలామంది దేశాధినేతలు దేశ పర్యటనకు వచ్చారు కానీ.. జపాన్ ప్రధాని మాదిరిలా మాత్రం మాటలతో చేతలతో ఆకట్టుకున్న వారు లేరనే చెప్పాలి.