బుమ్రా కష్టాల కడలి వీడియో..వైరల్

Update: 2019-10-11 11:01 GMT
కేవలం ఒక జత బట్టలు.. షూలతోనే ఎన్నో రోజులు గడిపాడు.. ఐదేళ్లకే క్రికెట్ మొదలుపెట్టినా ఆర్థిక స్థితి సహకరించలేదు. చిన్నప్పుడు నైక్ షూ కొనేలనేది బుమ్రా చిరకాల కోరిక అట.. ఆ షోరూం దగ్గరకు వెళ్లి ఎన్నో సార్లు షూలను చూసి ఎప్పటికైనా కొనాలని అనుకునేవాడట.. ఇప్పుడు దిగ్గజ క్రికెటర్ గా ఎదిగి ఏకంగా అదే నైక్ షూలకు ప్రమోటర్ గా ఎన్నో రకాల షూలను ధరించాడు.. ఇదీ మన టీమిండియా క్రికెటర్ జస్పీత్ బూమ్రా కష్టాల కడలి కథ..

ఒక జత బట్టలు - షూలతో నైక్ షూస్ కొనలేకపోయిన బూమ్రా ఇప్పుడు దేశం గర్వించే క్రికెటర్ గా ఎదగడం వెనుక అతడి కృషి పట్టుదల ఉంది. ఐదేళ్లకే తండ్రిని కోల్పోయినా అతడి తల్లి కష్టపడి పెంచింది. తల్లి కష్టాలు చూసి పట్టుదలతో బౌలర్ గా ఎదిగి ఇప్పుడు టీమిండియా కీలక బౌలర్ గా మారాడు.

బూమ్రా క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన వీడియోను తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ లండన్ లో నిర్వహించిన ‘స్పోర్ట్స్ బిజినెస్ సమ్మిట్’లో ప్రదర్శించారు. బూమ్రా కుటుంబం కష్టాలను అందులో కళ్లకు కట్టినట్టు చూపించారు. బూమ్రా క్రికెట్ లో ఎదగడానికి పడిన కష్టాలన్నీ  ఆ వీడియోలో సదస్సులో పాల్గొన్న వారికి నీతా చూపించారు.

బూమ్రాను ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరుఫున ప్రోత్సహించామని.. అతడిప్పుడు దేశం గర్వించే క్రికెటర్ గా ఎదిగాడని నీతా చెప్పుకొచ్చింది. ఈ పదేళ్లలో పేదరికంలో ఉన్న  హార్ధిక్ - కృనాల్ - బూమ్రా లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లను తెరపైకి తీసుకొచ్చామని నీతా చెప్పుకొచ్చింది. బూమ్రా ఎంతో మందికి ఆదర్శమని వివరించింది.

కాగా బూమ్రా కష్టాల కడలిని వివరించే వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది. బూమ్రా ఎలా ఎదిగాడన్నది చూసి చాలా మంది అతడిని ప్రశంసిస్తున్నారు.  షేర్ చేస్తూ ఆదర్శంగా అంటూ కొనియాడుతున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి


Tags:    

Similar News