జయకు వారసురాలిని నేనే

Update: 2016-12-12 12:00 GMT
జయకు వారసురాలిని నేనే
  • whatsapp icon
జయలలిత మరణం తరువాత అక్కడి పరిస్థితులు గుంభనంగా కనిపిస్తున్నా లోలోన మాత్రం వేడి రగులుతోంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నా కూడా ఎప్పటికైనా ఆ పీఠంపై తాను కూర్చోవాలని జయ నెచ్చెలి శశికళ పావులు కదుపుతున్నారు. మరోవైపు జయ మేనకోడలు తాజాగా తానే అసలైన వారసురాలినంటూ ప్రకటన చేశారు.

జయలలితకు అసలైన వారసురాలిని తానేని ఆమె మేనకోడలు దీప ఈరోజు ప్రకటించారు. దీప జయ సోదరుడు జయకుమార్ కుమార్తె.  ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన మేనత్త జయలలిత లేని లోటును శశికళ భర్తీ చేస్తారని ఏఐఏడీఎంకే నేతలే ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. ఏ రకంగా చూసినా తన మేనత్తకు వారసురాలిని తానేని ఆమె స్పష్టం చేశారు.

కాగా, గతంలో ఆమె పోయెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన ఇంటిలో తనకు వాటా ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే... జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో దీప అక్కడకు రాగా ఆమెను లోనికి రానివ్వకుండా శశికళ మనుషులు అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీప తాజాగా తానే వారసురాలినని ప్రకటించుకోవడం రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.
Tags:    

Similar News