తమిళనాడు పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖా మంత్రి బీవీ రమణ అనూహ్యంగా మంత్రి పదవి కోల్పోయాడు. ముఖ్యమంత్రి జయలలిత ఆయనపై వేటు వేశారు. అంతే కాదు.. అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి పదవి నుంచి కూడా రమణను తప్పించారు జయలలిత. ఐతే రమణను ఎందుకు తొలగిస్తున్నది చెప్పలేదు. అసలు కారణం ఏంటన్నది మాత్రం అందరికీ తెలుసు. ఓ మహిళతో రమణ ముద్దులాట ఆడతున్న వీడియో ఒకటి ఇటీవలే బయటపడింది. ‘మంత్రిగారి సరసం’ పేరుతో ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో మరో ఆలోచన లేకుండా రమణపై వేటు వేశారు జయలలిత.
రమణను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ జయలలిత సిఫారసు చేయగా.. గవర్నర్ రోశయ్య దానికి ఆమోద ముద్ర వేశారు. వెంటనే రమణ స్థానంలో గ్రామీణ పరిశ్రమల శాఖా మంత్రి మోహన్ డెయిరీ డెవలప్మెంట్ శాఖను చేపట్టారు. ఐతే రమణ ముద్దులాడుతూ కనిపించిన వీడియోలో ఉన్నది ఆయన భార్యే అంటున్నారు ఆయన సహచరులు. ఐతే అక్కడ ఉన్నది ఎవరైనా ఈ వీడియో బయటికి వచ్చాక రమణ ఇమేజ్ బాగా దెబ్బ తింది. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇది పార్టీని దెబ్బ తీస్తుందని భావించి ఆయనపై వేటు వేశారు జయలలిత. ఆమె ఇంతకుముందు కూడా ఓసారి రమణను మంత్రి పదవి నుంచి తప్పించారు. తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు. ఐతే రమణకు మళ్లీ ఇంకో అవకాశం దక్కడం మాత్రం సందేహమే.