అమ్మకు అనారోగ్యం.. ఇప్పుడెలా ఉంది?

Update: 2016-09-23 04:35 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై ఈ మధ్యకాలంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె కిడ్నీల వ్యాదిలో బాదపడుతున్నారని, అమ్మకు చక్కెర వ్యాది ఎక్కువగా ఉందని ఇలా రకరకాల కథనాలు అమ్మ ఆరోగ్యంపై వెలువడుతూ ఉన్నాయి! దీంతో కథనాల్లో వాస్తవాల మాటమేటో తెలియక అమ్మ అభిమానులు ఆందోళన చెందుతుంటారు. ఆ గాసిప్పుల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా మరోసారి జయలలిత అస్వస్థతకు గురయ్యారు.

అన్నాడీఎంకే అధినేత్రి గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం రావడంతోనే ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారని వైద్యులు చెబుతున్నారు. ఆమె డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతోందని, అయితే ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులు - కార్యకర్తలు - ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు వెల్లడించారు. అయితే వయసు రీత్యా జయలలితను ప్రస్తుతం అబ్వరేషన్ లో ఉంచామని, కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వివరించారు. కాగా ఈ మధ్యకాలంలో ఆమె ఆరోగ్యంపై పార్టీ నేతలతో పాటు తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News