ఇన్నాళ్ల తర్వాత అమ్మ ప్రజలకు లేఖ రాశారోచ్

Update: 2016-11-14 04:08 GMT
‘‘అమ్మ ఇలా ఉన్నారు.. అమ్మ అలా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆమె చూస్తున్నారు. డాక్టర్లతో మాట్లాడుతున్నారు. ఆమె పేపర్లు చదువుతున్నారు. లేచి నిలబడ్డారు. ఉడకబెట్టిన యాపిల్ ముక్కల్ని సొంతంగా తినేస్తున్నారు’’ అంటూ ఎన్నో వార్తలు బయటకు రావటం తెలిసిందే. అమ్మ ఆరోగ్యం గురించి వచ్చిన వేలాది వార్తలకు తొలి స్పందనగా తమిళనాడురాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత  తొలిసారి ప్రజలకు లేఖ రాశారు.

తీవ్రఅస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న అంశంపై ఎన్నో సంశయాలు.. మరెన్నో ఊహాగానాలు వినిపించాయి. అమ్మకు ఏదో అయిపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుగా ప్రచారం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అమ్మ ఆరోగ్యంపై పార్టీ నేతలు మొదలు.. ఆమెకు స్వయంగా వైద్యం చేస్తున్న వైద్యులు సైతం రోజువారీగా ఎప్పటికప్పుడు అమ్మకు సంబంధించిన సమాచారాన్ని బయట పెట్టలేదు. దీంతోఆమెను విపరీతంగా అభిమానించే వారంతా తీవ్ర ఒత్తిడికి గురి కావటమే కాదు.. మానసిక ఆందోళనలకు గురయ్యారు.

ఇదిలా ఉండగా తాజాగా అమ్మేస్వయంగా తమిళనాడు ప్రజలకు ఒక లేఖ రాశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆమె రాసిన లేఖను విడుదల చేశారు. ఈ లేకలో తన ఆరోగ్యం కుదుట పడిందని.. ఇది తనకు పునర్జన్మగా అమ్మ అభివర్ణించటం గమనార్హం. త్వరలో రాష్ట్రంలోనూ.. పుదుచ్చేరిలోనూ జరగనున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న కొందరు పార్టీ కార్యకర్తలకు సంతాపం వ్యక్తం చేసిన ఆమె.. పార్టీ అభివృద్ధిలో అందరూభాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. సో.. అమ్మ లేఖ రాస్తున్నారంటూ.. త్వరలోనే ఆసుపత్రి నుంచి అమ్మ ఇంటికి వచ్చేస్తున్నట్లేనని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News