బాలీవుడ్ డ్రగ్స్ వివాదం పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వివాదంపై బీజేపీ ఎంపీ.. నటుడు రవికిషన్ పలు ఆరోపణలు సంధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జయా బచ్చన్ కౌంటరిచ్చారు. కేవలం కొంత మందిని చూపిస్తూ మొత్తం బాలీవుడ్ నే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అది భావ్యం కాదని ఘాటుగా స్పందించారు. దీనికి మరో బీజేపీ ఎంపీ.. నటి జయప్రద గట్టి కౌంటనే ఇచ్చారు. ఇంతకుముందు కంగన రనౌత్ రెండు నిమిషాల పాత్ర కోసం హీరో సాంగత్యం తప్పలేదని వ్యాఖ్యానించగా జయప్రద కౌంటర్ తో జయాజీపై ఎటాక్ చేసిన వారి సంఖ్య అమాంతం పెరిగింది.
ఇంతకీ నటి కం భాజపా ఎంపీ జయప్రద ఏమని అన్నారు? అంటే..``రవికిషన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని... డ్రగ్స్ నుంచి యువతను కాపాడటం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరమ``ని జయప్రద అన్నారు. డ్రగ్స్ దందాకు వ్యతిరేకంగా వాయిస్ వినిపించాల్సిన తరుణమిదని జయాగారి స్టేట్ మెంట్ తో తాను ఏకీభవించినా దీన్ని రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. డ్రగ్స్ ని రాజకీయాలతో ముడిపెడుతూ స్టేట్‌మెంట్ ఇచ్చే అధికారం హక్కు జయగారికి లేవని స్పష్టం చేసింది.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన జయప్రద ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రగ్స్ వివాదాన్ని జయబచ్చన్ ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సుశాంత్ లాంటి యువకులు మరింత మంది బలికాకూడదంటే డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఆమె మాట్లాడాల్సింది. యావత్ దేశం మొత్తం సుశాంత్‌కు న్యాయం జరగాలని కోరుకుంటోందని జయప్రద చెప్పింది. మంగళవారం జయా బచ్చన్ లోక్ సభలో జరిగిన జీరో అవర్ చర్చలో నటుడు.. బీజేపీ ఎంపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్ గా జయప్రద స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయంగా దుమారాన్ని రేపడం ఖాయంగా కనిపిస్తోంది.