జయరాం కేసు: ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం

Update: 2019-02-06 10:10 GMT
ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి, డ్రైవర్ ను మాత్రమే నిందితులుగా ఏపీ పోలీసులు తేల్చారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి ప్రమేయం లేదని తేల్చారు.

కాగా ఈ కేసు విషయంలో శిఖా చౌదరిని తప్పించడంపై జయరామ్ భార్య అనుమానం వ్యక్తం చేశారు. జయరాం హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు కేసును టీవీ సీరియల్స్ లా సాగదీసి నిజాలు వెలికి తీయలేదని.. ఈ నేపథ్యంలో తనకు ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదని.. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు దాఖలైంది.

కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు పేర్కొంది. పద్మ శ్రీ ఏపీ పోలీసులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో అనవసరంగా వివాదాలకు తావు ఇవ్వవద్దని ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మేనకోడలు శిఖా చౌదరితోపాటు సొంత అక్క నుంచి ప్రాణ ఉందని పద్మశ్రీ మీడియాకు వెల్లడించారు. అందుకే శిఖా చౌదరిని ఈ కేసులో విచారించాలని ఆమె తెలంగాణ పోలీసులను కోరారు.
    

Tags:    

Similar News