మళ్లీ అదే సీన్.. మళ్లీ అదే ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో తమ తనయులను రంగంలోకి దింపాలా ? లేక.. తామే రంగంలోకి దిగాలా? అనేది ఇప్పుడు పెద్ద సమస్య. ఎందుకంటే.. ఒకవైపు.. పార్టీ అధినేత నుంచి ఉత్తర్వు.. మరోవైపు.. పార్టీ అనుచరులు, కార్యకర్తల నుంచి వస్తున్న విన్నపాలు.. వీటిని పక్కన పెడితే.. నియోజకవర్గం లో ప్రజల మూడ్. ఈ మూడు అంశాలను భేరీజు వేసుకుంటే.. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ పరిస్థితి తర్జన భర్జనలో ఉందని అంటున్నారు పరిశీలకులు.
తాడిపత్రి అసెంబ్లీ సీటు, అనంతపురం పార్లమెంటు స్థానాలను గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న జేసీ బ్రదర్స్ దివాకర్, ప్రభాకర్‌రెడ్డిలకు.. ఒకవైపు వారసత్వ సంకటం ఎదురవుతుంటే.. మరోవైపు.. తామే రంగం లోకి దిగాలనే డిమాండ్లు వస్తున్నాయి.గత ఎన్నికల్లో ఇద్దరూ వారసులను రంగంలోకి దింపారు. అయితే.. ఇద్దరూ కూడా ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా.. గెలిపించుకోవాలని భావిస్తున్నారు.
అయితే.. టీడీపీఅ ధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికే తేల్చి చెప్పారు. వచ్చేఎన్నికల్లో మీరు పోటీ చేస్తానంటేనే రండి! అని ఆయన కటువుగా చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఈ బ్రదర్స్ ఇద్దరూ కూడా ఏమీ తేల్చకుండా అలానే ఉండిపోయారు. మరోవైపు.. నియోజకవర్గం స్థాయిలోనూ.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు పోటీ చేస్తానంటేనే గెలిపించే మూడ్‌లో ప్రజలు ఉన్నారు. అంతేకాదు.. వారసులను వారు గుర్తించడం లేదు.
దీంతో వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేయాలని అనుకుంటున్నా.. ఇదే జరిగితే..వారసుల రంగ ప్రవేశం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని సోదరులు కుములుతున్నారు. అలాగని వారసులను రంగంలోకి దింపేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.