రాజకీయ నాయకులు అన్నాక డబ్బులు పంచడం తప్పని సరి. ఎమ్మెల్యే - ఎంపీగా ఉన్న నేనే కాదు. నాలాంటి వాళ్లు మొదలుకొని దేశ ప్రధాని నరేంద్రమోడీ వరకు అంతా ఓట్లకోసం డబ్బులు పంచినవాళ్లమే- ఇది అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్య. జేసీ నోరు తెరిస్తే ఏదో సంచలనం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ ఈ స్థాయిలో ఎవరూ ఊహించలేనిది. రాజకీయాలు మొదలుకొని రాష్ట్రం, దేశంలో ఉన్న సమస్యలన్నింటినీ మాట్లాడే జేసీ తాజాగా కూడా అదే తరహా కామెంట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై జేసీ స్పందిస్తూ బుద్ధిలేని వాళ్లే ఏపీకీ హోదా కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న దీక్షలను ప్రస్తావిస్తూ వాటితో ఎవరికీ ప్రయోజనం ఉండదు కానీ, దీక్షవల్ల జగన్ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సెటైర్ వేశారు. ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉందని తేల్చిచెప్పారు. ఇక భారత్ -పాకిస్తాన్ మధ్య పోరాటాన్ని జేసీ ప్రస్తావిస్తూ ఈ సమస్య వందేళ్లయినా ఇలాగే ఉంటుందని జోస్యం చెప్పారు. అందుకే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే మంచిదని జేసీ సెలవిచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/