రాజకీయ పరంగా అభిప్రాయాలు కుదరని నేపథ్యంలో కుటుంబ బంధాలనే తెంచుకున్న తనకు టీడీపీ - బీజేపీలతో స్నేహాన్ని వదులుకువాలంటే పెద్దగా సమస్య కాబోదన్న టాలీవుడ్ స్టార్ హీరో - జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నిజంగానే ఆసక్తి రేకెత్తించాయి. అంటే... అభిప్రాయాలు కలవకపోతే... టీడీపీ - బీజేపీలకు పవన్ చేయివ్వడం పెద్ద విషయం కాదన్న కోణంలోనూ చర్చ జరిగింది. అయితే నిన్న టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో ఆయన నిర్వహించిన భేటీ - ఆ తర్వాత ఇటు పవన్ తో పాటు అటు చంద్రబాబు స్టేట్ మెంట్లు విన్న తర్వాత పవన్ లోని నిజ స్వరూపమేంటో ఇట్టే తేలిపోయిందన్న వాస్తవాన్ని ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే.
ఇద్దరు నేతల బహిరంగ ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న అటు సీఎం - పవన్ భేటీ జరుగుతుండగానే... అక్కడికి సమీపంలోనే ఏపీ తాత్కాలిక సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతపురం ఎంపీ - వివాదాస్పద కామెంట్లకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు - పవన్ కల్యాణ్ ల మధ్య ఉన్న బంధమేంటో కూడా జేసీ కుండబద్దలు కొట్టేశారు.
అయినా వీరి బంధంపై జేసీ చేసిన కామెంట్లేంటన్న విషయానికి వస్తే... *చంద్రబాబు - పవన్ కల్యాణ్ లు ఎప్పటి నుంచో భాయీ... భాయీగా ఉన్నారు. పవన్ సమస్యను చెప్పిన వెంటనే స్పందిస్తున్న చంద్రబాబు దానిని పరిష్కరించేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలోనూ ఇదే జరిగింది* అని జేసీ వ్యాఖ్యానించారు. అంటే... ఇక ముందు కూడా చంద్రబాబుతోనే పవన్ కలిసి సాగుతారన్న వాదన వినిపించేలా జేసీ వ్యాఖ్యలు చేశారన్న మాట.