సంచలన వ్యాఖ్యల ఎంపీ జేసీ దివాకరరెడ్డి తన నోటి జోరును కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్ అంత సీను చంద్రబాబుకు లేదని మొదలుపెట్టిన జేసీని టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూలు చేస్తుండడంతో ఆయన ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. రీసెంటుగా ఓ ఛానల్ తో మాట్లాడిన ఆయన ఇప్పుడున్న నేతలంతా అడ్డగోలుగా తింటున్నారని అన్నారు. అంతేకాదు.. గతంలో ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే వెంటనే రాజీనామా చేసేవారని.. కానీ, ఇప్పటి నేతలు మాత్రం ఆధారాలు చూపించినా సిగ్గులేకుండా కంటిన్యూ అవుతున్నారని అన్నారు.
అంతేకాదు.. దేశంలో ప్రధాని - ముఖ్యమంత్రి పదవులు తప్ప మిగిలిన పదవులన్నీ బొమ్మలేనని జేసీ అన్నారు. ఎంపీగా తాను ఏమాత్రం సంతృప్తిగా లేనని చెప్పారు. అధికార పక్షం - ప్రతిపక్షం రెండూ ఒకే తాలుముక్కలుగా తయారయ్యాయన్నారు. తన రాజకీయ జీవితంలో ఇదే ఆఖరి పదవిగా తాను భావిస్తున్నానని చెప్పారు. అయినా ఇంకా గెలిచి చేయాల్సింది ఏముందన్నారు.
గతంలో ఒక ఆరోపణ రాగానే రాజీనామాలకు నాయకులు సిద్ధపడేవారని… ఇప్పుడు మాత్రం ఇంత తిన్నావ్ అని సాక్ష్యాలు చూపించినా స్పందించే వాడు ఒక్కనాకొడుకు కూడా కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం యోగం ఉంటే రోశయ్య ముఖ్యమంత్రి అయిన సమయంలోనే తనకు అవకాశం వచ్చేదన్నారు. కాబట్టి ఇక సీఎం అయ్యే చాన్స్ తనకు లేదన్నారు. తన కుమారుడు వైసీపీలోకి వెళ్తాడో లేదో తనకు తెలియదన్నారు. అది వారిష్టమని తేల్చేశారు. జేసీ తాజా కామెంట్ తో వచ్చే ఎన్నికల నాటికి జేసీ రూటెటు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/