జేసీని ఆటాడుకున్న పోలీసులు

Update: 2020-01-05 04:28 GMT
పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఇవాళ లొంగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు ఏడు గంటల తర్వాత జేసీకి బెయిల్ లభించింది. షరతులతో  కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. మరోమారు పోలీసులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని - నెలకోసారి స్టేషన్ లో సంతకం చేసి వెళ్లాలన్న షరతులు విధించింది. అంతకుముందు, జేసీకి బెయిల్ ఇచ్చే విషయమై ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన అనుచరుడు ఒకరు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి పెట్రోల్ పోసుకున్నాడు. షూరిటీల వెరిఫికేషన్ వల్లే ఆలస్యమైందని పోలీసులు చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో జేసీ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్ సర్కార్ దుర్మార్గపు పనులు చేస్తోందన్నారు. కక్షసాధింపు చర్యలు సరికాదని... యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. భయపెట్టి పాలించాలని చూడటం సరికాదని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఏపీ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా పోలీసులతో బూట్లు నాకిస్తా అనే వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ముందస్తు బెయిల్ పత్రాలు తీసుకొని ఇవాళ ఉదయం అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌ కు జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. బెయిల్‌పై ష్యూరిటీ పరిశీలించాలని, ఇతర కారణాలు చెబుతూ పోలీసులు జేసీని పోలీసు స్టేషన్‌ లో ఉంచారు. దాదాపు 7 గంటల పాటు ఆయన పీఎస్‌లోనే ఉండిపోయారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన మీడియాతో ఆయన మాట్లాడుతూ - వ్యక్తిగత కక్షతోనే తనను ఎనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టి పాలన చేయాలని చూస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని మోదీ బర్తరఫ్ చేయాలన్నారు.
 
Tags:    

Similar News