గాంధీజీ కొడుకులే తాగి దొర్లారు..నువ్వు అంతే జ‌గ‌న్‌

Update: 2017-08-18 08:56 GMT
నంద్యాల ఉప ఎన్నిక గ‌డువు స‌మీపిస్తున్న విమ‌ర్శ‌ల జోరు పెరుగుతోంది. అయితే నేత‌లు త‌మ నోటికి ప‌దును పెట్టే క్ర‌మంలో మ‌హ‌నీయుల‌ను సైతం అవ‌మానించ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. త‌న‌దైన శైలిలో వివాదాస్ప‌ద కామెంట్లు చేసే టీడీపీ నేత‌ - అనంతపురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి...ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిని విమ‌ర్శించేందుకు ఏకంగా జాతిపిత మహాత్మాగాంధీజీనే అవ‌మానించారు. వైసీపీ సానుభూతిప‌రులు డ‌బ్బులు పంచుతున్నార‌నే వార్త‌ల‌పై స్పందించిన జేసీ ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డుతూ గాంధీజీ కొడుకులు తాగుబోతుల‌ని తేల్చారు.

ఎన్నిక‌ల్లో భాగంగా ఓటర్లకు ఎంత పంచుతున్నారనేది ఎవరూ చెప్పర‌ని ఎంపీ జేసీ అన్నారు. అందరూ సత్య హరిశ్చంద్రులేన‌ని అయితే....అస‌లు విష‌యం ఏంటో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసున‌ని అన్నారు. డ‌బ్బుల‌తో దొరికిన వారు వేరే ఊరి నుంచి వచ్చారని చెప్తున్నార‌ని..అలాంట‌పుడు మహా అయితే 10వేలు ఉంటాయి..లక్షలు దొరికాయంటే ఏమిటి అర్థం అని ఎంపీ జేసీ ప్ర‌శ్నించారు.  వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం ఎంపీ....వాళ్లకు తప్పదని వ్యాఖ్యానించారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు పంచుతున్నారో లేదో త‌న‌కు తెలియ‌దని అన్నారు. ` నాకు డబ్బు లేదు - పేపర్ లేదు - టీవీ లేదంటూ జగన్ చెప్తున్నారు. ఫోటో వేసుకుంటూ అన్నీ నడుపుతూ నాది కాదంటే ఎలా? ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా`` అని ఎంపీ జేసీ వ్యాఖ్యానించారు.

త‌న‌కు జగన్ పై సానుభూతి ఉందని ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అన్నారు. ``నేను చిన్నప్పటి నుంచి జగన్ ను చూస్తున్నాను. మంచి రాజకీయ నాయకుడిగా జగన్ ను తీర్చిదిద్దాలని నాకుంది. అయితే ఇన్ని అబద్దాలు చెబితే ఎప్పుడు పైకొస్తావు జగన్? అదేమంటే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకునని ప్రచారం చేసుకుంటున్నాడు. మహానుభావుడు మహాత్మగాంధీ కొడుకులే తప్పతాగి బజార్లలలో దొర్లాడారు. అంటే మహానుభావుల కొడుకులందరూ మంచోళ్లేనా?`` అని తెలుగుదేశం ఎంపీ జేసీ వివాదాస్ప‌ద కామెంట్లు చేశారు. రాజకీయ నాయకుడు ప్రజల్లో విశ్వసనీయత సాధించాలని ఆయ‌న సూచించారు.

Full View
Tags:    

Similar News