క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీలో మరోమారు ఆ పార్టీ నేతల వివాదాస్పద ప్రవర్తన తెరమీదకు వచ్చింది. పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తున్న జాబితాలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేరారు. ఆయన మరోసారి హల్ చల్ చేశారు. ఏకంగా యూస్ లెస్ ఫెలోస్ అంటూ సీఐపై విరుచుకుపడ్డారు.
అనంతపురం టిడిపిలో జేసీ బ్రదర్స్ - ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య కొంత కాలంగా విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నారు. సీఎం వారించినా ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు. కోల్డ్ వార్ కొనసాగుతుండగానే ఉంది. ఇదే సమయంలో అనంతపురం ఎమ్మెల్యే వర్గానికి చెందిన మేయర్ స్వరూప...నిన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి రాక్షసుడిలా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ఇలా విమర్శించినందుకు మేయర్ స్వరూప - ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు జేసీ అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివనాయుడిని అరెస్టు చేశారు. అయితే తన అనుచరుడిని ఎలా అదుపులోనికి తీసుకున్నారంటూ తాడిపత్రి సీఐ భాస్కర్ రెడ్డి పై వీరంగం చేశాడు. కోపంతో ఊగిపోయాడు
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని సీఐ బాస్కర్ రెడ్డి - జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే తనపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే - మేయర్ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. యూస్ లెస్ ఫెలోస్ అంటూ పోలీసులను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించారు. కాగా, ఈ పరిణామంపై పోలీసులు అవాక్కవుతున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి - మేయర్ స్వరూపలను బెదిరించిన కేసులో తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ వర్గీయుడు శివనాయుడిని అరెస్టుచేశామని, అయితే, స్టేషన్ బెయిల్ మీద ఆయనను విడుదల చేశామని తాడిపత్రి సీఐ మురళీకృష్ణ మీడియాలో వివరించారు.