ఈ విధేయత లెక్కలేంటి జేసీ ప్రభాకర్

Update: 2016-01-28 04:58 GMT
తెలుగురాజకీయాల్లో కొంతమంది బ్రదర్స్ కనిపిస్తారు. మిగిలిన వారితో పోలిస్తే.. వీరి మాటలు.. చేష్టలు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే.. ఈ బ్రదర్స్ లో ఒకరు తూర్పు అయితే మరొకరు పడమర అన్నట్లుగా వారి వైఖరి ఉంటుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఆనం బ్రదర్స్. అదే సమయంలో.. దీనికి భిన్నంగా సంచలన వ్యాఖ్యలు.. ఎవరేం అనుకున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడే వారిలో మొదట ఉంటారు జేసీ బ్రదర్స్.

సంచలన వ్యాఖ్యలు చేసే ఈ ఇద్దరు బద్రర్స్ లో ఒకరైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ నోటి నుంచి తాజాగా అలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. అనంతపురం జిల్లా వానవోలులో మీడియాతో మాట్లాడిన ఆయన..  తనకు చంద్రబాబు పిలిచి టిక్కెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. బాబులో విజన్ ను పొగిడేశారు. బాబు మీద విధేయతను ప్రదర్శించుకునే క్రమంలో తాను చంద్రబాబుకే విధేయుడినని.. టీడీపీకి కాదంటూ కొత్త మాటను వినిపించారు.

తనకు కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో స్నేహం ఉండటంతో వారిని కలుస్తానని.. ఎవరికో భయపడి వారితో మాట్లాడకుండా ఉండలేనని కుండబద్ధలుకొట్టారు. చంద్రబాబు మీద ప్రేమ ఉండటం ఓకే.. కానీ.. టీడీపీ మీద ప్రేమ లేదని చెప్పటం ఏమిటో..? ఏమైనా జేసీ బ్రదర్స్ మాటలు మాటలే సుమా.
Tags:    

Similar News