జేడీ - నిమ్మగడ్డ బీజేపీలో చేరుతారా ?

Update: 2021-03-15 10:38 GMT
ఉన్నతస్ధానాల్లో పనిచేసి రిటైర్ అయినవాళ్ళు రాజకీయాల్లో చేరటం ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. మన రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేడీ గతంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేనలో చేరి విశాఖపట్నం ఎంపిగా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

అప్పటి నుండి జేడీ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. తర్వాత జనసేనకు రాజీనామా కూడా చేసేశారు. ఇపుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా జనాలకు తెలీదు. అలాంటి జేడీ తొందరలోనే కమలం కండువా కప్పుకోబోతున్నట్లు ఒక్కసారిగా ప్రచారం పెరిగిపోతోంది. జేడీతో పాటు రిటైర్ అయిన తర్వాత నిమ్మగడ్డ కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం ముమ్మరమైంది. ఆమధ్య నిమ్మగడ్డ టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఆయన చూపుకూడా బీజేపీవైపే ఉందంటున్నారు. జేడీ+నిమ్మగడ్డ ఆలోచనలు కమలంపార్టీకి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. పార్టీని బలోపేతం చేయటంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గట్టి వాళ్ళు, న్యూట్రల్స్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. స్ధానిక సంస్ధల ఎన్నికల పుణ్యమా అని నిమ్మగడ్డ బాగా పాపులారిటి సంపాదించుకున్నారు. కాబట్టి ఆయనకు కొత్తగా పరిచయటం అవసరంలేదు.

కాబట్టి తొందరలోనే నిమ్మగడ్డ - జేడీ లాంటి వాళ్ళకు అమిత్ నుండి పిలుపు రావచ్చని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న ఈ ప్రచారం ఉత్త ప్రచారంగా మాత్రమే మిగిలిపోతుందా లేకపోతే వర్కవుటవుతుందా అన్నది కొద్ది రోజులు వెయిట్ చేస్తేకానీ తెలీదు.


Tags:    

Similar News