టీడీపీ ఎంపీతో జేడీ...మ్యాటరే మరి...?

Update: 2022-04-29 16:30 GMT
ఆయన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ. ఇంటి పేరుగా జేడీని మార్చుకుని స్టార్ వర్షిప్ ని యూత్ నుంచి అందుకున్న మాజీ ప్రభుత్వ అధికారి. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసి రెండు లక్షల డెబ్బై అయిదు వేల పై చిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. కేవలం పది హేను రోజుల ప్రచారానికే  ఈ రేంజిలో సౌండ్ చేసిన జేడీ విశాఖను వదిలేది లేదు అంటున్నారు.

ఈసారి కచ్చితంగా ఆయన పోటీ చేయడం ఖాయం. అది కూడా ఎంపీగానే. ఏ పార్టీ అన్నది ప్రస్తుతానికి తెలియదు. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చారు. ఆప్ లో చేరుతారు అని ఈ మధ్యనే వినిపించింది. ఆ సంగతి అలా ఉంటే ఆయన తాజాగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహనాయుడుతో కలసి విశాఖలో ఒక కార్యక్రమంలో కనిపించారు. ఇది నిజంగా ఒక రేర్ కాంబోగానే చూడాలి అంటున్నారు.

అయితే ఇది పొలిటికల్ గా కాదు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ గురించే ఈ ఇద్దరు నాయకులూ కలిశారు. ఉత్తరాంధ్రా పెద్దాసుపత్రిగా పేరు గడించిన కేజీహెచ్ లో జేడీ ఫౌండేషన్ తరఫున అభివృద్ధి కార్యక్రమాలను తన వంతుగా లక్ష్మీనారాయణ సాయం చేస్తున్నారు. మరింత సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని జేడీతో పాటు టీడీపీ ఎంపీ చెప్పడమే ఇక్కడ విశేషం.

ఒక విధంగా జేడీ ఫౌండేషన్ అన్నది రాజకీయాలకు అతీతంగా లక్ష్మీనారాయణ చేస్తున్న కార్యక్రమం. దానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ కూడా తన వంతుగా సాయం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఒక ఉన్నత ఆశయం కోసం ముందుకు రావడం మంచి పరిణామమే. ఇక రామ్మోహన్ అయితే ఉత్తరాంధ్రా టీడీపీలో కీలక నేత. యువకుడిగా తన సత్తా చాటుతున్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అందుకే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు. అలాంటి రామ్మోహన్ తో జేడీ కలసి ముందుకు సాగడం అంటే అది కేవలం అభివృద్ధి కార్యక్రమాల వరకేనా లేక రాజకీయంగా కూడా ఈ ఇద్దరూ ఒకే పార్టీ వైపుగా అడుగులు వేస్తారా అన్నది చూడాలి. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న జేడీ టీడీపీలోకి వస్తే గ్రాండ్ వెల్ కమ్ లభిస్తుందని కూడా చెబుతారు. మొత్తానికి జేడీ అన్ని ఆప్షన్లను తన వద్ద ఉంచుకున్నారు. మరి ఆయన ఏ వైపుగా డైషన్ తీసుకుంటారో వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News