నితీశ్ 'ఇంట్లో' అస‌మ్మ‌తి మంట‌

Update: 2017-07-27 07:21 GMT
రోజంటే రోజు. ఆ మాట‌కు వ‌స్తే కొద్ది గంట‌లే. ఒక సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి.. మ‌ళ్లీ వెంట‌నే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం సాధ్య‌మేనా? అంటే అవున‌ని ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేరు. కానీ.. జెట్ స్పీడ్ తో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వేగంగా మారిన బీహార్ రాష్ట్ర రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తే.. ప‌వ‌ర్ ఉన్నోడు త‌లుచుకుంటే ఎప్పుడేమైనా చేసేయొచ్చ‌న్న భావ‌న క‌ల‌గ‌టం.

మోడీ.. నితీశ్ లు అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా అధికార బ‌దిలీ ఎపిసోడ్ సాగుతున్న వేళ‌.. అనూహ్యంగా మ‌రో ప‌రిణామం చోటు చేసుకుంది.

తాజా ప‌రిణామాల‌పై నితీశ్ కి చెందిన జేడీయూ పార్టీ ఎంపీ ఒక‌రు త‌న అస‌మ్మ‌తి బాహాటంగా బ‌య‌ట పెట్టేశారు. నితీశ్ నిర్ణ‌యాన్ని జేడీయూ ఎంపీ అలీ అన్వ‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. నితీశ్ మ‌రోసారి బీజేపీతో జ‌ట్టుక‌ట్టటంపై ఆయ‌న మండి ప‌డుతున్నారు. నితీశ్ త‌న అంత‌రాత్మ ప్ర‌బోధం ప్ర‌కారం బీజేపీతో క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. త‌న అంత‌రాత్మ ప్ర‌కారం తాను న‌డుచుకుంటాన‌ని చెప్పారు. త‌న‌కు అవ‌కాశం ఇస్తే ఇదే విష‌యాన్నిపార్టీ వేదిక మీద లేవ‌నెత్త‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. తాము సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో ఇలాంటి అస‌మ్మ‌తి రాగాలకు తావు లేకుండా చూసుకున్న మోడీ అండ్ నితీశ్ లు తాజాగా ప‌రిణామాల‌కు ఎలాంటి రియాక్ష‌న్ ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News