తెలంగాణ కాంగ్రెస్ నేతలకు.. తెలంగాణ అధికారపక్షాని మధ్య నడుస్తున్న మాటల పోరు కొత్తరూపు దాలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల్ని గులాబీ కారు ఎక్కించటంతో ఆగ్రహంతో ఉడికిపోతున్న కాంగ్రెస్ అధినాయకత్వం.. టీఆర్ ఎస్ మీద విమర్శల వర్షం కురిపించాలని కోరుతోంది.ఇందులో భాగంగా సరైన అంశం చేతికి చిక్కితే రచ్చ రచ్చ చేయాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ నేతలకు తగ్గట్లే వారికిప్పుడు మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల వ్యవహారం అంది వచ్చినట్లైంది.
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చే రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించి ఉంటే అస్సలు ఇబ్బందే ఉండేది కాదు. అయితే.. అందుకు భిన్నంగా భూనిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పినాసితనంగా వ్యవహరించటం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. దీనికి తోడు భూమిని కోల్పోతున్న వారు సైతం ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉండటం కలిసి వచ్చింది. దీంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 123 వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వ తీరును దుమ్మెత్తి పోసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. రైతుల పక్షాన నిలిచిన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్ లోని భూమి ఎకరా రూ.10 లక్షలకు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగితే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నట్లుగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు కోసం నిర్వాసితుల భూమిని పరిహారం కోసం ఇచ్చేయాలంటున్న ప్రభుత్వం.. అదే రీతిలో ప్రభుత్వాధినేత భూమిని ఎకరానికి రూ.10లక్షలు చొప్పున ఇస్తే భూమిని ఇచ్చేస్తారా? అని ప్రశ్నిస్తున్న జీవన్ రెడ్డి మాటకు టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల.