రాహుల్ ను కవితమ్మ అందుకే విమర్శించారా?

Update: 2015-07-25 12:42 GMT
ఏపీలోని అనంతపురం జిల్లాలో శుక్రవారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయటం తెలిసిందే. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అని చెప్పి పది కిలోమీటర్ల దూరాన్ని పాదయాత్ర చేసిన రాహుల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె.. నిజామాబాద్ ఎంపీ కవిత తీవ్రస్థాయిలో మండపడటం తెలిసిందే.

కాంగ్రెస్ చేసిన పాపాలు కడుక్కునేందుకు.. రాహుల్ గోదావరి పుష్కరాల్లో స్నానం చేయాలని.. చేసిన పాపాలు కడుక్కోవాలంటూ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. కవిత చేసిన ఆరోపణలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాహుల్ ను విమర్శలు చేయటంలో ఎంపీ కవిత ఆలోచనలు వేరని.. రాహుల్ ని విమర్శించటం ద్వారా.. ఏన్డీయేకు దగ్గర కావాలని ఆమె భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ.. పలు ప్రశ్నలు సంధించారు.  చేసిన పాపాలు పోవాలంటే గోదావరి పుష్కర స్నానాలు చేయాలని రాహుల్ వ్యాఖ్యానించటం ఆమె అహంకారానికి నిదర్శనంగా అభివర్ణించిన జీవన్ రెడ్డి సూటిగా ఒక ఉదంతాన్ని ప్రస్తావించారు.

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చినప్పుడు ఢిల్లీలో సోనియా నివాసానికి వెళ్లి కేసీఆర్ కుటుంబం వెళ్లటం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వటం రాహుల్ చేసిన పాపమా? అని సూటిగా ప్రశ్నించారు. తమ అధినాయకుడు రాహుల్ పై విరుచుకుపడిన కవితపై జీవన్ రెడ్డి స్పందించారు. మిగిలిన కాంగ్రెస్ నేతలూ సైతం విమర్శలు విమర్శల కత్తులు నూరుతూ రెఢీ అవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News