తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఫైర్ బ్రాండ్ లక్షణాలున్న నేతల్లో జీవన్ రెడ్డి ఒకరు. ఇప్పుడంటే కాస్త జోరు తగ్గించారు కానీ.. వైఎస్ హయాంలో ఆయన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆయన నోటి తాకిడికి రాజకీయ ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అలాంటి జీవన్ రెడ్డిని ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయన జోరు తగ్గిందనే చెప్పాలి. తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్.. టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో తాజాగా జీవన్ రెడ్డి గళం విప్పారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం గుట్టు త్వరలోనే బయటపడుతుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ తెలంగాణ సచివాలయానికి రావటమే పెద్ద వార్త అయిపోయిందంటూ ఎద్దేవా చేసిన ఆయన.. సెక్రటేరియట్ కంటే ఫాంహౌస్ లో గడపటమే ఎక్కువగా ఉందన్నారు.
త్వరలో ఫాంహౌస్ గుట్టు బయటపడుతుందన్న ఆయన..కేసీఆర్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుతున్నారని.. ఆర్థిక స్థిరత్వం అంటే కేసీఆర్ బాగుపడటమేనా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఫాంహౌస్ గుట్టు త్వరలో బయటపడుతుందని చెబుతున్న జీవన్ రెడ్డి.. ఆ గుట్టేంటో ఆయనే చెప్పేస్తే మరింత బాగుంటుంది కదా..?